తెలుగు బుల్లితెరపై చాలా మంది మేల్ యాంకర్స్ ఉన్నారు. కానీ.., వారిలో ప్రదీప్ మాచిరాజు స్థానం మాత్రం ప్రత్యేకం. ప్రదీప్ కామెడీలో ఎక్కడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవు. అతని హోస్టింగ్ ని ఫ్యామిలీ అంతా కలసి చూడవచ్చు. ఈ కారణంగానే ప్రదీప్ కి విపరీతమైన లేడీ ఫాలోయింగ్ ఉంది. కానీ.., గత కొన్నేళ్లుగా ప్రదీప్ కి లైఫ్ పార్ట్నర్ దొరకడం లేదు.
తన ప్రొఫెషన్ ని అర్ధం చేసుకునే అమ్మాయి దొరికే వరకు వెయిటింగ్ తప్పదని ఇప్పటికే ప్రదీప్ తేల్చి చెప్పేశాడు. అయితే.., ఈ గ్యాప్ లో ప్రదీప్ కి ప్రపోజల్స్ కి మాత్రం కొదవే లేదు. ఇప్పటికే ఎంతో మంది అమ్మాయిలు ప్రదీప్ కి కెమెరా ముందే ప్రపోజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ.., ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తూ మరో స్టార్ యాంకర్ శ్రీముఖి.. ప్రదీప్ కి లవ్ ప్రపోజ్ చేసింది.
బిగ్ బాస్ కి వెళ్ళకముందు శ్రీముఖి చేతిలో చాలానే ఆఫర్స్ ఉన్నాయి. కానీ.., ఆ షో నుండి బయటకి వచ్చాక శ్రీముఖి కెరీర్ బాగా డల్ అయిపోయింది. ఆమె మార్క్ కనిపించేలా ఒక్క షో కూడా లేకుండా పోయింది. దీంతో.., శ్రీముఖి అన్నీ ఛానెల్స్ లో అలా ప్రత్యక్షం అయ్యి, ఇలా మాయం అవుతూ కెరీర్ ని నెట్టుకొస్తోంది. కానీ.., ప్రదీప్ పరిస్థితి అది కాదు.
ప్రదీప్ చేతిలో చాలా షోలు ఉన్నాయి. ఢీ-13 , సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్ ఇలా అన్నిట్లోనూ ప్రదీప్ కనిపిస్తూనే ఉన్నాడు. తాజాగా ప్రదీప్ డ్రామా జూనియర్స్ – ద నెక్ట్స్ సూపర్ స్టార్ అనే పిల్లల షోకి యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే.., నెక్స్ట్ వీక్ ప్రోమో తాజాగా విడుదల అయ్యింది.
ఈ ప్రోమోలో యాంకర్ శ్రీముఖి మొహానికి ముసుగుతో శ్రీదేవిలా ఎంట్రీఇచ్చింది. మానవా మీరు సిద్దమేనా అని అడగగా.., దీనికి ప్రదీప్ గత ఐదేళ్లుగా సిద్ధంగా ఉన్నాను అంటూ బదులిచ్చాడు. దీంతో.., ముసుగి తీసి.. నీకు నేను ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నా.. ఐ లవ్ యూ అని అందరి ముందే చెప్పేసింది రాములమ్మ.
శ్రీముఖి ఇలా ప్రపోజ్ చేయడంతో అక్కడే ఉన్న జడ్జెస్ తో సహా, ప్రదీప్ కూడా షాక్ అయిపోయాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ లవ్ ప్రపోజల్ స్క్రిప్ట్ లో భాగమేనా? లేదా నిజమా అన్నది తెలియాలంటే ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే వరకు ఎదురుచూడాల్సిందే.