Srimukhi: తెలుగు బుల్లితెరలో టాప్ ఫీమేల్ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. ఆ ఛానల్, ఈ ఛానల్ అని హద్దులు లేకుండా అన్ని ఛానల్స్‌లో షోలు చేస్తూ బిజీ యాంకర్‌గా మారిపోయారు. అభిమానులు ఆమెను ప్రేమగా బుల్లితెర రాములమ్మగా పిలుస్తుంటారు. శ్రీముఖి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. తాజాగా, అభిమానులతో ఇంటరాక్ట్ అయిన ఆమె.. పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ అభిమాని పెళ్లి ప్రస్తావన తేగా.. శ్రీముఖి సమాధానం ఇస్తూ.. ‘‘ ఏమో సార్! నాకు ఇంట్రస్ట్ పోయింది’’ అని అన్నారు. పెళ్లిపై శ్రీముఖి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. నెటిజన్లు తమదైన శైలిలో ప్రశ్నలు, సమాధానాలతో రచ్చ చేస్తున్నారు.
కాగా, శ్రీముఖి ‘‘అదుర్స్’’ అనే షోతో యాంకర్‌గా పరిచయమయ్యారు. త్రివిక్రమ్- అల్లు అర్జున్‌ల ‘‘జులాయి’’ సినిమాతో నటిగా మారారు. ‘‘ ప్రేమ, ఇస్క్,కాదల్’’ సినిమాతో హీరోయిన్‌గా అయ్యారు. ఓ వైపు టీవీ షోలు చేస్తూనే మరో వైపు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘‘భోళా శంకర్’’ సినిమాలో ఓ క్యారెక్టర్ చేస్తున్నారు. మరి, శ్రీముఖి పెళ్లిపై చేసిన కామెంట్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Sukumar: పుష్ప-2 కోసం ఊహలకి కూడా అందని మాస్టర్ ప్లాన్!