సినీ ఇండస్ట్రీలో అతిలోక సుందరిగా పేరు తెచ్చుకొని కోట్ల మంది అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన నటి శ్రీదేవి. బాలనటిగా కెరీర్ ఆరంభించి.. స్టార్ హీరోయిన్ గా ఎదిగిన శ్రీదేవి బాలీవుడ్ కి చెందిన నిర్మాత బోనీకపూర్ ని వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ అక్కడే స్థిరపడిపోయింది. ఈ దంపతులకు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ లు జన్మించారు. జాన్వీ కపూర్ ని స్టార్ హీరోయిన్ గా చూడాలన్న కోరిక శ్రీదేవికి ఉన్నప్పటికీ.. ఆ కోరిక తీరకుండానే కన్నుమూసింది. తల్లి కోరిక మేరకు జాన్వీ ‘ధడక్’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది.
ఈ మద్య చాలా మంది సెలబ్రెటీలు కెరీర్ సాఫీగా సాగుతున్న సమయంలోనే ఫ్యూచర్ ప్లాన్ చేస్తున్నారు. పెద్ద వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడం.. కొంత మంది నిర్మాతలుగా మారడం చూస్తున్నాం. ఎవరికైనా జీవితంలో మంచి ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉంటుంది. సినీ ఇండస్ట్రీకి చెందిన వారు తమకు ఇష్టమైన రీతిలో సొంత ఇంటి నిర్మాణం చేపడుతుంటారు. తమ ఇంట్లో ఏదో ఒక ప్రత్యేకత ఉండేటా చూసుకుంటారు. తాజాగా ప్రముఖ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కోట్లు పెట్టి ఒక విలాసవంతమైన భవనాన్ని కొన్నట్లు బీ టౌన్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముంబాయిలో బాంద్రాలో రూ.65 కోట్లు ఖర్చు పెట్టి ఒక డూప్లెక్స్ హౌజ్ ని తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
బాలీవుడ్ లో ప్రస్తుతం బోనీ కపూర్ స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు. శ్రీదేవి నట వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ చాలా సెలెక్టెడ్ పాత్రల్లో నటిస్తూ తన నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది. మరోవైపు కుర్రాళ్లకు కిర్రెక్కించేలా ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకంటుంది. ప్రస్తుతం జాన్వీ ఒక్కో సినిమాకు రూ.5 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు బీ టౌన్ లో టాక్ నడుస్తుంది. అంతేకాదు పలు బ్రాండ్లకు ప్రమోట్ చేస్తూ డబ్బు సంపాదిస్తుంది. ఇటీవల జాన్వీ కపూర్ జూహూ ఫ్లాట్ ని ప్రముఖ నటుడు రాజ్ కపూర్ కి అమ్మిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బాంద్రాలో అన్నికోట్లు పెట్టి లగ్జరీ డూప్లెక్స్ భవనాన్ని కొనుగోలు చేసిందని అంటున్నారు.
జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది.. తనకు సంబంధించిన ప్రతి విషయం ఫ్యాన్స్ కి షేర్ చేస్తుంది. ఇక ఈ అమ్మడి హాట్ ఫోటో షూట్, వీడియోల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ముంబాయిలో బాంద్రా ప్రాంతంలో చాలా మంది నటీనటులు స్థిరపడ్డారు. అందుకే ఇండస్ట్రీకి చెందిన వారు ఇక్కడే కొత్త ఇళ్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుంటారు. ఒక రకంగా చెప్పాలంటే బాలీవుడ్ నటులకు జుహు ప్రాంతం కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే జాన్వీ కపూర్ జుహు లో ఇల్లు కొనుగోలు చేసినట్లు బీ టౌన్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. బోనీ కపూర్ నిర్మించిన ‘మిలి’ చిత్రం రిలీజ్ అయ్యింది.. ఇందులో జాన్వీ నటనలకు మంచి మార్కులే పడ్డాయి.