యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బుల్లితెర మీద మోస్ట్ గ్లామరస్ యాంకర్‌గా పేరు తెచ్చుకోవడమే కాక.. సినిమాలు చేస్తూ హీరోయిన్‌గా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ సరైన హిట్ కోసం ఎదురు చూస్తోంది. ఇక బుల్లితెర, వెండితెర మీద గ్లామర్ రోల్స్ చేస్తూ.. ఎలా కనిపించినా.. రియల్ లైఫ్‌లో మాత్రం చాలా మంచి మనసున్న వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకుంది రష్మీ. జంతు ప్రేమికురాలిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక బుల్లితెర మీద రష్మీ-సుధీర్‌ల జోడికి ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసిన వారు ఎవరైనా సరే.. రియల్ లవర్స్ అనుకుంటారు. 9 ఏళ్లుగా వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడిపి.. టీఆర్‌పీ రేటింగ్‌లు కొల్లగొట్టింది. అయితే తాజాగా సుధీర్ వేరే చానెల్‌కి మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రష్మీ ఎక్స్‌ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తోంది.
ఇక ఈటీవీలో వచ్చే ప్రత్యేక షోలలో పెళ్లి తంతు తప్పకుండా ఉంటుంది. ఇప్పటికే సుధీర్-రష్మీకి ఎన్నోసార్లు పెళ్లి చేశారు. తర్వాత వర్ష-ఇమ్మాన్యుయేల్‌కి కూడా పెళ్లి చేశారు. ఈ క్రమంలో మరోసారి పెళ్లి తంతుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది శ్రీదేవి డ్రామా కంపెనీ. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో రష్మీ గౌతమ్ తన పెళ్లికి సంబంధించిన ప్రకటన చేసింది. వచ్చే ఆదివారం ప్రసారం కాబోతోన్న ఈ ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేశారు. అక్కా బావెక్కడ అంటూ చేస్తోన్న ఈ ఎపిసోడ్‌లో రష్మీ తన పెళ్లి గురించి ప్రకటన చేసినట్టు కనిపిస్తోంది. ఇక ఈ ప్రోమో ఇప్పుడు నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది.
ఇన్ని రోజులు మీరు నన్ను అడిగిన ప్రశ్నకు ఈ రోజు నేను సమాధానం చెప్పబోతోన్నాను.. నాకు పెళ్లి కుదిరింది అంటూ రష్మీ తెగ సిగ్గు పడిపోయింది. మెలికలు తిరిగింది. ఇక అక్కా బావెక్కడ అని మిగతా టీం మెంబర్స్ అడిగారు. అయితే రష్మీ తనకు పెళ్లి కుదిరిందని స్టేజ్ మీదే అందరి ముందు చెప్పింది. ఆఖర్లో కన్నీరు కూడా పెట్టింది రష్మీ. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్‌గా మారింది. మరి ఇదంతా నిజమా.. లేక ఎపిసోడ్ ప్రోమో కోసం చెప్పిన స్క్రిప్ట్ డైలాగా.. అన్నది తెలియాల్సి ఉంది.
కానీ యూట్యూబ్ వీడియో కింద నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోతోన్నారు. మల్లెమాలను, శ్రీదేవీ డ్రామా కంపెనీ టీంను తెగ తిట్టి పోస్తున్నారు. ఇలాంటివి ఎన్నో చూసేశాం.. ఇంకెన్నాళ్లు బకరాలను చేస్తారు.. ప్రోమోల కోసం ఇలాంటి స్టంట్లు ఎందుకు చేస్తారు అంటూ కామెంట్స్‌తో మోత మోగిస్తున్నారు. ఇక రష్మీ తన పెళ్లి అని చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మడం లేదు. ఇదంతా కూడా పబ్లిసిటీ స్టంటేనని కొట్టి పారేస్తున్నారు. మరి నిజంగానే ఇదంతా ఎపిసోడ్ కోసం చెప్పారా.. లేదంటే రష్మీ నిజంగానే తన పెళ్లి మీద ప్రకటన చేస్తుందా.. అన్నది తెలియాలంటే వచ్చే ఆదివారం వరకు ఆగాల్సిందే. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.