గత కొన్ని రోజుల నుంచి తెలుగు మీడియాలో పవిత్రా లోకేష్, నరేష్, రమ్య వ్యవహారం కాస్త కాంట్రవర్సీగా మారిన విషయం తెలిసిందే. దీనిపై నరేష్, పవిత్రా లోకేష్ స్పందించి ఒకరిపై ఒకరు మాటలు తూటాలు పేల్చుకుంటున్నారు. అయితే ఆదివారం మైసూర్‌లో నరేశ్- పవిత్ర లోకేశ్ హోటల్ లో ఉండగా రమ్య రఘుపతి అక్కిడికి చేరుకున్నారు. దీంతో హోటల్ నుంచి బయటకు వెళ్లబోతున్న నరేశ్- పవిత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో చెప్పుతో పవిత్రా లోకేశ్ కొట్టే ప్రయత్నం కూడా చేశారు. వెంటనే గమనించిన పోలీసులు ఆమెను పోలీసులు బయటకు పంపేశారు. అయితే ఈ కాంట్రవర్సీపై తాజాగా స్పందించారు వివాదాస్పద నటి శ్రీరెడ్డి. ఫేసు బుక్ లైవ్ లో మాట్లాడిన ఆమె పవిత్రా లోకేష్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.
స్వీట్ గా మాట్లాడటానికి రాలేదు, కయ్యానికి కాలుదువ్వే పందెం కోడిలా వచ్చానంటూ శ్రీరెడ్డి తోడగొట్టి మరీ మాట్లాడింది. ఇక తర్వాత శ్రీరెడ్డి మాట్లాడుతూ.. నా జోలికి ఎవరైనా వస్తే తాట తీసి ఎండబెడతా. ఆ విషయం మీకు కూడా తెలుసు. అయితే ఒకానొక సమయంలో నేను చేసే మీటూ ఉద్యమానికి చాలా మంది నన్ను కించపరిచేలా చేసి నన్ను అవమానించిన విషయం తెలిసిందే. అలాంటి వాళ్లు అందరూ ఇప్పుడు అనుభవిస్తున్నారు. కర్మ ఫలితం లేట్ అవ్వొచ్చేమో కానీ ఫలితం మాత్రం అనుభవించకతప్పదు. ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Naresh- Pavitra: మైసూర్ హోటల్ లో నరేశ్- పవిత్రను అడ్డుకున్న మూడో భార్య రమ్య!
నటి పవిత్రా లోకేశ్‌పై శ్రీరెడ్డి ఆరోపణలు గుప్పిస్తూ.. ‘నరేష్ భార్య విషయంలో కలుగజేసుకునేందుకు నువ్వు ఎవరు..? ఆమె క్యారెక్టర్ గురించి మాట్లాడేందుకు నువ్వు ఎవరు..? ఆమెకు మాట్లాడే స్వేచ్చ ఉంది. ఎందుకు ఇతరుల జీవితాల్లో నిప్పులు పోస్తున్నావు.నువ్వు ఎందరితో అయినా రిలేషన్‌షిప్స్ పెట్టుకోవచ్చు. మీ టూ ఉద్యమం గురించి మేం మాట్లాడితే.. మాకు వ్యతిరేకంగా మాట్లాడింది. నరేష్ కూడా నన్ను మా అసోసియేషన్‌లో నాలుగేళ్లు బ్యాన్ చేశాడు. అతను నలుగురు ఐదుగురితో అపవిత్ర బంధాలు పెట్టుకోవచ్చు. ఆయన గురించి ఎన్ని చెప్పినా తక్కువే. ఆయన గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్.
మీటూ ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారు ఇప్పుడు రోడ్డున పడి ఏడుస్తున్నారు. వారు దేంట్లో కూడా సక్సెస్ కాలేకపోతున్నారు. నా మీద కక్ష తీర్చుకోవాలనుకున్న వారికే సినిమాలన్నీ అట్లర్ ప్లాఫ్ లు అవుతున్నాయి. చాలా మంది నన్ను పైకి రానీయకుండా అడ్డుకున్నారు. నాతో అడుకున్న వారందరూ నాశనం అయిపోవాలి. నేను ఎంతో ఇబ్బంది పడ్డా. నేను ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నానో నేను పడుకునే దిండుకు తెలుసు. నేను పైకి గ్లామర్ గా కనిపిస్తున్నాను కానీ.. ఈ మూడు సంవత్సరాల్లో నేను పడిన వ్యథను ఎక్కడ కూడా చెప్పాలేదని శ్రీరెడ్డి ఏడుస్తూ.. తన బాధను చెప్పుకొచ్చింది. కర్మ అనేది ఎవరినీ వదిలిపెట్టదని.. కచ్చితంగా అనుభవించి తీరుతారని అంది. తాజాగా శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.