ఏపీలోని సినిమా టికెట్ రేట్ల వ్యవహారం రోజు రోజుకు ముదురుతూనే ఉంది. ఈ ఇష్యూపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరుసగా కామెంట్లు చేస్తూ.. జగన్ ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నారు. నిన్న మొన్నటివరకు టికెట్ రేట్ల విషయంలో అటు ఆర్జీవీకి ఇటు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి మధ్య ట్విట్టర్ లో యుద్ధమే సాగింది. అయితే.. తాజాగా ఈ వివాదంలోకి నటి శ్రీరెడ్డి ఎంటరయ్యింది.
ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియో పోస్ట్ ద్వారా ఆర్జీవీ పై విమర్శలు గుప్పించింది. పనీపాట లేని వ్యక్తి ఆర్జీవీ! అంటూ అన్నీ ఓపెన్ కామెంట్ చేసింది. మాములుగానే RGV, శ్రీరెడ్డి ఇద్దరూ సోషల్ మీడియాలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్. మరి ఈ ఇద్దరి మధ్యే వివాదం చెలరేగితే..? ఆ పరిస్థితి ఊహించగలమా! తాజా పరిస్థితులు చూస్తుంటే సరిగ్గా ఊహించనిదే జరిగేలా ఉందని అభిప్రాయాలు వెలువడుతున్నాయి.
శ్రీరెడ్డి RGV గురించి మాట్లాడుతూ.. “ఆయన పైకి వేదాంతిలా కనిపించినా.. ఎవరైనా తనకు వ్యతిరేకంగా మాట్లాడితే ప్రతీకారం తీర్చుకునే టైప్. తన గురించి వార్తలు రానిరోజు చాలా మూడీగా ఉంటాడు. ఏమైనా సమాజం కోసం మంచి పనులు చేస్తాడా అంటే లేదు. ఈయన చేసే పనులు బ్లూ ఫిలిమ్స్ తీయడం. స్త్రీ జాతిని అవమానించేలా మాట్లాడటం. ఇతని దృష్టిలో అమ్మాయి అంటే దానికి మాత్రమే అనే భావన ఉంది. ఏది ఏమైనా అది నీ ఖర్మ. కానీ.. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రెచ్చగొట్టకు. సీఎం జగన్ ని ఏమన్నా అనే ముందు నన్ను దాటుకొని వెళ్లాలని గుర్తు పెట్టుకో” అంటూ విరుచుకుపడింది. ప్రస్తుతం శ్రీరెడ్డి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.