హైపర్ ఆది.. బుల్లితెర కమీడియన్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత టీమ్ లీడర్ గా, వెండితెరపై కమీడియన్ గా ఎదిగాడు. చాలా చిత్రాల్లో తన నటనతో మెప్పించాడు. జబర్దస్త్ విషయానికి వస్తే ఆది లేకుండా ఆ షోని ఊహించుకోలేం అంటూ ఇప్పటికే చాలా మంది ప్రేక్షకులు చెప్పడం చూశాం. ఆది టైమింగ్, పంచ్‌లు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకుంటాయి. అయితే గతకొన్ని వారాలుగా ఆది జబర్దస్త్ లో కనిపించడం లేదు. ఎందుకు రావడంలేదు అనేదానిపై క్లారిటీ లేదు. కానీ, శ్రీదేవీ డ్రామా కంపెనీలో మాత్రం హైపర్ ఆది కనిపిస్తూనే ఉన్నాడు. తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీ విడుదల చేసిన ప్రోమో వైరల్ గా మారింది.
ఇదీ చదవండి: నాకు అందుకే పెళ్లి కాలేదు.. వైరల్ అవుతున్న కంగనా రనౌత్ కామెంట్స్!
శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమోలో హైపర్ ఆదిని మాత్రం ఓ రేంజ్ లో ఆడుకున్నారు. పెళ్లి తర్వాత శోభనం కోసం ఎదురుచూసే పెళ్లికొడుకు పాత్రలో ఆది జీవించేశాడు. జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇస్తేనే శోభనం చేస్తామంటూ డైలాగులు కూడా వేశారు. అయితే తనకున్న నలుగురు చెల్లళ్లకు పెళ్లి చేయాలంటూ ఎపిసోడ్ చేశారు. ఆ క్రమంలో ఆదిపై ఓ రేంజ్ లో పంచులు పడ్డాయి. ఆది పంచ కూడా లాగేసి నెత్తిన కప్పేశారు. అలా ఎపిసోడ్ ఆద్యంతం ఆదిపై పంచుల వర్షం కురిపించారు. జడ్జ్ గా ఉన్న ఇంద్రజ అయితే కుర్చిలోచి లేచివెళ్లిపోయి మరీ పడిపడి నవ్వుకుంది. ప్రస్తుతం ఆ ప్రోమో వైరల్ గా మారింది. మరి ఈ వైరల్ ప్రోమోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.