బుల్లితెర సక్సెస్‌ఫుల్ అండ్ బిజీ యాంకర్ల లిస్టులో శ్రీముఖి టాప్-5లో నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం ఉండదు. ప్రస్తుతం ఈ రాములమ్మ సరిగమప, జాతిరత్నాలు షోలు చేస్తూ.. స్పెషల్ ఈవెంట్స్ లోనూ తళుక్కుమంటోంది. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలోనూ ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. తన అల్లరి, డెడికేషన్, ఉన్నది ఉన్నట్లు మాట్లాడే ముక్కు సూటితనం ఆమెను ఇక్కడి దాకా తీసుకొచ్చాయని ఫ్యాన్స్ చెబుతుంటారు. బుల్లితెర, సినిమాలే కాదు.. సోషల్ మీడియాలోనూ శ్రీముఖి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తన డైలీ యాక్టివిటీస్, సెట్స్ లో చేసే అల్లరి, ఫొటో షూట్స్ అన్నీ తన ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది.
తాజాగా శ్రీముఖి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో శ్రీముఖి వీకెండ్ పార్టీని ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఆమెతో పాటు స్టైలిస్ట్ కీర్తనా సునీల్ కూడా ఉన్నారు. మొదట కీర్తనతో కలిసి ఇంట్లో ఫిష్ ఫ్రై చేసుకుని శ్రీముఖి రచ్చ రచ్చ చేసింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కారులో షికారుకు వెళ్లారు. ఆ తర్వాత మూవీ నైట్, డిన్నర్ అంటూ నైట్ అవుట్ ఎంజాయ్ చేసినట్లు కీర్తనా సునీల్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.
శ్రీముఖి కూడా వీకెండ్ పార్టీకి సంబంధించిన మొత్తం హైలైట్స్ ను ఓ వీడియోలా చేసి పోస్ట్ చేసింది. తాము చేసుకునే ఎక్కువ శాతం పార్టీలు అస్సలు ప్లాన్ చేసినవి కాదని.. అలా రోడ్డు మీదకు వచ్చి మనసుకు అనిపించింది చేసేస్తుంటాం అంటూ కీర్తనా సునీల్ కామెంట్ చేశారు. ప్రస్తుతం శ్రీముఖి పార్టీ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శ్రీముఖి వీకెండ్ పార్టీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.