తన చిలిపి చేష్టలతో, గలగలా మాటలతో బుల్లి తెరపై యాంకర్‌గా తన కంటూ గుర్తింపు తెచ్చుకున్న నటి.. శ్రీముఖి. అంతటితో ఆగిపోకుండా అవకాశం వచ్చినప్పుడల్లా సినిమాల్లోనూ నటిస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక.. సోషల్ మీడియాలో శ్రీముఖి కున్న ఫాలోయింగ్ గురుంచి, చేసే అల్లరి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మందు తాగే స్టిల్స్ మొదలు.. బుల్లి గౌనులు వేసుకొని డాన్స్ చేస్తున్న స్టిల్స్ వరకు అన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు.. ఎవ్వరూ ఊహించని లుక్స్‌తో నెటిజన్ల మతిపోగొడుతోంది.
సోషల్‌మీడియాలో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేస్తూ కుర్రాళ్లను కవ్విస్తోన్న.. శ్రీముఖి. తాజాగా తెలుగందం ఉట్టిపడేలా, సాంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చింది. ఈ ఫోటోలు చూసిన వారెవరైనా.. నిజంగా శ్రీముఖేనా అనకమానరు. అలా సాంప్రదాయ దుస్తుల్లో.. పదహారణాల తెలుగమ్మాయిల పోజులిస్తోంది.
పటాస్ షో ద్వారా యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి.. బిగ్‌బాస్ షో ద్వారా అభిమానుల్ని సంపాదించుకుంది. ఆ తరువాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ అందరిని మెప్పించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రూపొందించిన ‘జులాయి’ సినిమాలో అల్లు అర్జున్ సోదరిగా.. ‘నేను..శైలజ’ చిత్రంలో హీరో రామ్‌కు సోదరిగా నటించింది. ఈ మధ్యనే.. క్రేజీ అంకుల్స్ సినిమాలో హీరోయిన్ గా నటనతోనూ మెప్పించింది. సాంప్రదాయ దుస్తుల్లో ‘శ్రీముఖి’.. ఎలా ఉందొ మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Anupama Parameswaran: తొలిసారి గ్లామర్ షోతో రెచ్చిపోయిన అనుపమ!
ఇది కూడా చదవండి: నెలలో మూడు రోజులు కేటాయించలేవా? అంటూ అనసూయను నిలదీసిన చలాకీ చంటి!