తెలుగు టీవీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని యాంకర్ లలో శ్రీముఖి ఒకరు. ఓవైపు టీవీ షోలతో పాటు మరోవైపు అడపాదడపా సినిమాలలో నటిస్తోంది. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉండే శ్రీముఖి తాజాగా కొత్తావతారంలో ఫ్యాన్స్ అందరినీ ఆశ్చర్యపరిచింది. శ్రీముఖి లేటెస్ట్ బోల్డ్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఏప్రిల్ 4 నుండి ఈటీవీ ప్లస్ లో జాతిరత్నాలు అనే ఎంటర్టైన్ మెంట్ ప్రోగ్రాం ప్రారంభం కాబోతుంది. ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ కోసం శ్రీముఖితో బ్లాక్ సూట్ లో ఫోటోషూట్ జరిపారు నిర్వాహకులు. ప్రస్తుతం ఆ ఫోటోలు శ్రీముఖి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో స్టార్ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా గ్లామరస్ గా కనిపిస్తుంది శ్రీముఖి. ట్రెండీ సూట్ లో శ్రీముఖి బోల్డ్ లుక్ యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది.
ఇదిలా ఉండగా.. శ్రీముఖికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ చాలా ఉంది. యాంకరింగ్, సినిమాలతో పాటు ఈ భామ వ్యాపారరంగంలో కూడా రాణిస్తోంది. బిగ్ బాస్ తో సూపర్ క్రేజ్ దక్కించుకున్న తర్వాత శ్రీముఖి హీరోయిన్ గా సినిమాలు ఎక్సపెక్ట్ చేశారు ఫ్యాన్స్. కానీ ఎన్ని అవకాశాలు వచ్చినా తాను ప్లాన్ తో వెళ్తోంది. ఇప్పటికే శ్రీముఖి కొన్ని షోలకు హాట్ ఫేవరేట్ యాంకర్ గా కంటిన్యూ అవుతోంది.