శ్రీముఖి.. యాంకర్ గా, నటిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. రాములమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జాతిరత్నాలు అంటూ మరో కొత్త ప్రోగ్రామ్ తో బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. వాళ్లందరినీ తీసుకుని సుమ క్యాష్ ప్రోగ్రామ్ వెళ్లింది శ్రీముఖి. శ్రీరామనవమి సందర్భంగా చేసిన స్పెషల్ ఎపిసోడ్ ని శ్రీముఖి ఇంకా స్పెషల్ గా మార్చింది. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతున్నా కూడా ఎందుకు తాను ఇంకా పెళ్లి చేసుకోలేదో శ్రీముఖి చెప్పుకొచ్చింది.
ఇదీ చదవండి: సన్నీ లియోన్ ని చూసి భయంతో పరుగులు పెట్టిన మంచు విష్ణు
‘నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అయినప్పటికీ.. ఎంతోమంది అందమైన హీరోలు, కో యాక్టర్ లతో పని చేసినప్పటికీ.. ఎవ్వరికీ నా మనసు ఇవ్వకుండా ఇప్పటిదాకా పెళ్లి చేసుకోకుండా.. నా మెడలో మూడు ముళ్లు వేయించుకోకుండా ఉండటానికి కారణమైన వ్యక్తి ఎవరో కాదు..’ అంటూ ప్రోమో క్లోజ్ చేశారు. శ్రీముఖి మాట్లాడుతున్నంత సేపు.. లవ్ బీజీఎంలు, స్క్రీన్ మీద లవ్ సింబల్ ఎఫెక్ట్స్ ఇచ్చారు. ఇవన్నీ చూస్తుంటే మరి శ్రీముఖి మనసులో ఉంది ఎవరో స్పెషల్ గా రివీల్ చేయబోతోందనే భావన కలుగుతోంది. మరి, నిజంగానే చెప్తుందా? లేక ఇదంతా టీఆర్పీ స్టంటా అనేది తెలియాలి అంటే ఎపిసోడ్ వచ్చే దాకా ఆగాల్సిందే.
అయితే తన లైఫ్ లో ఉన్న ఓ డార్క్ లవ్ స్టోరీని శ్రీముఖి బిగ్ బాస్ లో రివీల్ చేసిన విషయం తెలిసిందే. తాను ఇండస్ట్రీకి వచ్చిన కొన్నాళ్లకు ఒకరిని ప్రేమించినట్లు.. ఆ తర్వాత అతనికి బ్రేకప్ చెప్పానంది. ఆ సమయంలో చనిపోవాలని కూడా అనుకున్నట్లు తెలిపింది. ఆ తర్వాత కెరీర్ పై ఫోకస్ పెట్టినట్లు చెప్పుకొచ్చింది. కానీ, అతను ఎవరు అనేది రివీల్ చేయలేదు. అది డార్క్ సీక్రెట్ అని ముగించింది. శ్రీముఖి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.