టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది హీరోయిన్ శ్రీలీల. ఆమె ఏకంగా నంబర్ వన్ స్పాట్‌కే గురిపెట్టింది. ఆమె లైనప్ చూస్తే మైండ్ బ్లాంక్ కావాల్సిందే.
ఏ రంగంలోనైనా సరే నంబర్ వన్ ఎవరు, టాప్ ప్లేస్‌లో ఎవరు ఉన్నారనే దానిపై పెద్ద చర్చే నడుస్తూ ఉంటుంది. అది క్రీడలు కానివ్వండి, వ్యాపార రంగం కానివ్వండి. చిత్రసీమ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. నంబర్ వన్ ప్లేసులో ఉన్నవారికి ఉండే క్రేజ్, పాపులారిటీ వేరు కదా. రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. అందుకే నటీనటులు ఆ స్థాయికి, స్థానానికి చేరుకునేందుకు కష్టపడుతుంటారు. ఇక, టాలీవుడ్లో టాప్ హీరో హీరోయిన్ ఎవరంటే చెప్పలేని పరిస్థితి. నిన్నమొన్నటి వరకు అనుష్క, తమన్నా ఆ తర్వాత సమంత, పూజా హెగ్డే.. ఇలా టాప్ హీరోయిన్స్‌గా కొనసాగుతూ వచ్చారు. కానీ అనుష్క సినిమాలు తగ్గించేశారు. తమన్నా బాలీవుడ్ మీద ఫోకస్ పెడుతున్నారు.
మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత.. ఒకప్పటిలా తెలుగులో మూవీస్ చేయడం లేదు. ఆమె కూడా బాలీవుడ్‌పై దృష్టి సారిస్తున్నారు. పూజా హెగ్డేకు ఈమధ్య ఏదీ కలసి రావడం లేదు. ఆమె నటించిన మూవీస్ కొన్ని పరాజయం పాలయ్యాయి. పూజ చేతిలో క్రేజీ ప్రాజెక్టులు కూడా ఎక్కువగా లేవు. దీంతో టాలీవుడ్లో ఒకరకంగా టాప్ హీరోయిన్ పొజిషన్ ఖాళీగా ఉందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఒక భామ మాత్రం తానున్నానని.. వరుస ప్రాజెక్టులతో ఆ పొజిషన్‌ను చేజిక్కించుకునేందుకు దూసుకొస్తోంది. ఆమె మరెవరో కాదు.. శ్రీలీల. ఆమె లైనప్ చూస్తే ఎవరైనా ఇది ఒప్పుకోవాల్సిందే.
హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ సరసన నటించిన ‘పెళ్లిసందD’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీలీలకు.. ఆ చిత్రం మంచి పేరు తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆమె డ్యాన్సులకు ప్రేక్షకుల నుంచి అప్లాజ్ లభించింది. దీంతో ఆమెకు మాస్ మహారాజా రవితేజ సరసన నటించే ఛాన్స్ దక్కింది. వీళ్లు జోడీగా యాక్ట్ చేసిన ‘ధమాకా’ గతేడాది ఆఖర్లో రిలీజై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. రవితేజ జోష్‌కు ఏమాత్రం తగ్గకుండా డ్యాన్సులు, యాక్టింగ్‌తో శ్రీలీల అదరగొట్టింది. దీంతో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. శ్రీలీల చేతిలో ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 9 ప్రాజెక్టులు ఉన్నాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంలో మెయిన్ హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తుండగా.. మరో కథానాయికగా శ్రీలీల యాక్ట్ చేస్తోంది. అలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన ‘ఉస్తాద్ భగత్ సింగ్’లోనూ ఒక హీరోయిన్గా యాక్ట్ చేస్తోందీ మిల్కీ బ్యూటీ. బాలకృష్ణ ఎన్బీకే108లో ఆయనకు కూతురిగా కీలక పాత్రలో కనిపించనుంది. మెయిన్ హీరోయిన్గా బోయపాటి-రామ్ పోతినేని మూవీ, నితిన్ కొత్త సినిమాల్లో నటిస్తోంది. అలాగే వైష్ణవ్ తేజ్ తర్వాతి శ్రీలీలే హీరోయిన్గా అలరించనుంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సరసన యాక్ట్ చేసే ఛాన్స్‌నూ ఆమె కొట్టేసింది. అలాగే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తర్వాతి మూవీలోనూ శ్రీలీలే హీరోయిన్గా కనిపించనుంది. ఆమె నటిస్తున్న ఈ చిత్రాల్లో మ్యాగ్జిమమ్ హిట్టయితే.. టాలీవుడ్లో నంబర్ వన్ పొజిషన్ ఆమెదేనని సినీ విశ్లేషకులు అంటున్నారు.