సీరియల్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీవాణి.. ప్రస్తుతం యూట్యూబర్ గా చాలా ఫేమస్. తన ఫ్యామిలీతో కలిసి ఎప్పటికప్పుడు వ్లాగ్స్ చేస్తూనే ఉంటుంది. అందులో తన భర్త విక్రమ్ తోపాటు కూతురు నందిని కూడా చాలా చలాకీగా పాల్గొంటూ ఉంటారు. అలా రెగ్యులర్ గా వీడియోస్ చేసే శ్రీవాణికి 6 లక్షలకు పైగానే సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ప్రస్తుతం లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న శ్రీవాణి.. కొత్త కారు కొనుగోలు చేసింది. అలానే తోటి నటీనటులు, యూట్యూబర్స్ కి గ్రాండ్ లెవల్లో పార్టీ కూడా ఇచ్చింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీవాణి, ఆ తర్వాత సీరియల్స్ కు షిప్ట్ అయింది. ప్రధాన పాత్రల్లో, విలన్ రోల్స్ లో పలు సీరియల్స్ లో నటించింది. ఈ లిస్టులో ‘కలవారి కోడలు’, ‘మనసు మమత’, ‘కాంచన గంగ’, ‘చంద్రముఖి’ లాంటి సీరియల్స్ ఉన్నాయి. ఇక కొన్నేళ్ల నుంచి మాత్రం పెద్దగా నటించట్లేదు. పూర్తిగా ఫ్యామిలీకే పరిమితమైనట్లు కనిపిస్తుంది. ఇకపోతే అప్పుడప్పుడు టీవీ షోల్లో కనిపించే ఈమె.. యూట్యూబ్ లో మాత్రం రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంది.
గత నెలలో కొత్తింట్లోకి అడుగుపెట్టిన శ్రీవాణి.. ఇప్పుడు కొత్త కారు కూడా కొనేసింది. ఇక గ్రాండ్ విట్టారా కారు కొన్నానని చెప్పింది. హైదరాబాద్ లో దీని ధర రూ.13 లక్షలపైనే ఉంది. ఇక కారు కొన్న తర్వాత రోజు మైసమ్మ గుడిలో పూజ చేయించారు. ఆ టెంపుల్ లోనే తోటి నటీనటులు, యూట్యూబర్స్ కి గ్రాండ్ గా దావత్(పార్టీ) కూడా ఇచ్చారు. ఇందులో హిమజ, మలయజ తదితరులు కనిపించారు. నాన్ వెజ్ ఐటమ్స్ కూడా గట్టిగానే పెట్టారు. మరి శ్రీవాణి కొత్త కారు వీడియోపై మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.