కన్నడ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. పవర్ స్టార్ గా పేరు పొందిన పునీత్ రాజ్ కుమార్ కన్నుమూశారు. జిమ్ లో వర్కౌట్ చేస్తున్న ఆయన సడెన్ కు హార్ట్ ఎటాక్ కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఇక వెంటనే స్పందించిన ఆయన కుటుంబ సభ్యులు బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించగా మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. దీంతో వెంటనే స్పందించిన కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మే హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని పూనీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఇక పునీత్ రాజ్ కుమార్ మరణంపై దక్షిణాది చిత్రపరిశ్రమలోనే నటీనటులంతా ఒక్కొక్కరుగా స్పందిస్తూ అతని ఆత్మకు శాంతి చేకూరాలని ట్విట్టర్ లో స్పందిస్తున్నారు. తాజాగా తెలుగు నటి మంచు లక్ష్మీ ట్విట్టర్ లో స్పందిస్తూ కన్నడ చిత్ర పరిశ్రమ మంచి నటుడు కోల్పోయిందని, పునీత్ రాజ్ కుమార్ ఆత్మకు శాంతి చూకూరాలని తెలిపింది. దీంతో పాటు నటుడు సోనుసూద్ కూడా స్పందించాడు. విల్ ఆల్ వేస్ మిస్ యూ బ్రదర్ అంటూ ట్విట్టర్ లో స్పందిచారు.
ఇక ఆయనతో పాటు టీమిండియా మాజీ క్రికెటర్ విరేంద్ర సెహ్వగ్ కూడా స్పందించారు. పునీత్ రాజ్‌కుమార్ మరణవార్త విన్నటం చాలా బాధగా ఉందని, ఆయన మరణం భారతీయ సినిమాకు తీరని లోటు. అతని ఆత్మ శాంతి చేకూరాలి. ఓం శాంతి అంటూ సెహ్వగ్ ట్వీట్ చేశారు. ఇక టాలీవుడ్ హీరో రామ్ పోతినేని కూడా ట్విట్టర్ వేదికగా స్పందించాడు. నేను చూసిన అత్యంత వినయపూర్వకమైన నటుల్లో పునీత్ రాజ్ కుమార్ ఒకరు. రెస్ట్ ఇన్ పీస్ బ్రదర్. అంటూ ఆయన ట్వీట్ చేశాడు.