సూపర్ స్టార్ రజనీకాంత్ వరస షాకులు తగులుతున్నాయి. మొన్న పెద్ద కూతురి ఇంట్లో భారీ దొంగతనం జరగ్గా.. తాజాగా చిన్న కుమార్తె ఇంట్లో ఖరీదైన వస్తువులు చోరీకి గురయ్యాయి. ఇంతకీ ఏం జరుగుతోంది?
సూపర్ స్టార్ రజనీకాంత్ కూతుళ్లకు అస్సలు అచ్చి రావట్లేదు! ఈ మధ్య పెద్ద కుమార్తె ఐశ్వర్య ఇంట్లో దొంగతనం జరిగింది. చెన్నైలోని ఆమె ఇంట్లో నుంచి 100 సవర్ల బంగారు ఆభరణాలు, 30 గ్రాముల వజ్రభరణాలు, 4 కిలోల వెండి, ఆస్తి పత్రాల్ని ఎవరో ఎత్తుకెళ్లిపోయారు. అయితే ఇదంతా పనిమనిషి-డ్రైవర్ కలిసి చేశారని పోలీసులు కనిపెట్టారు. మొత్తం వాటన్నింటిని ఇద్దరి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇది జరిగిన నెలన్నరకు అంటే తాజాగా రజనీ చిన్నకూతురు సౌందర్య ఇంట్లో దొంగతనం జరిగింది. దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఏంటి సంగతి?
అసలు విషయానికొస్తే.. సూపర్ స్టార్ రజనీకాంత్ ఓవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు ఆయన కూతుళ్లు కూడా డైరెక్టర్స్ గా కాస్త బిజీగానే ఉన్నారు. పెద్దమ్మాయి ఐశ్వర్య ప్రస్తుతం ‘లాల్ సలామ్’ షూటింగ్ తో కాస్త బిజీగా ఉంది. దీంతో ఆమె ఇంట్లో లేని టైంలో పనివాళ్లు దొంగతనం చేశారు. వాళ్లని పోలీసులు పట్టుకున్నారు. అక్కడివరకు బాగానే ఉంది. సరే అయిపోయిందేదో అయిపోయిందనే లోపు.. ఇప్పుడు రజనీకాంత్ చిన్న కూతురు ఇంట్లో ఖరీదైన వస్తువులు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
గతనెలలో అంటే ఏప్రిల్ 23న.. సౌందర్య రజనీకాంత్ తన ఇంటి నుంచి తేనంపెట్టాయ్ లోని ఓ కాలేజీకి తన రేంజ్ రోవర్ కారులో వెళ్లింది. రిటర్న్ ఇంటికి వచ్చి చూస్తే.. మరో కారు తాళంతోపాటు ఓ పౌచ్ కూడా మిస్ అయినట్లు గుర్తించింది. తాజాగా పోలీస్ స్టేషన్ లో ఈ విషయమై ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నారు. సరే ఇదంతా పక్కనబెడితే.. ఇలా నెలన్నర వ్యవధిలో రజనీకాంత్ కూతుళ్ల ఇళ్లలో దొంగతనాలు జరగడం అనుమానాలు రేకెత్తిస్తోంది. మరి ఈ చోరీలపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.