టాలీవుడ్ బెస్ట్ కపుల్స్‌లో ఒకరు రామ్ చరణ్-ఉపాసన జంట. 11 ఏళ్ల క్రితం అనగా 2012 జూన్14న చెర్రీ-ఉపాసన పెళ్లి ఘనంగా జరిగింది. రెండు పెద్ద కుటుంబాలు ఈ వేడుక ద్వారా ఒకటయ్యాయి. పెళ్లి సమయంలో ఈ జంటపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఈ జంట..
టాలీవుడ్ బెస్ట్ కపుల్స్‌లో ఒకరు రామ్ చరణ్-ఉపాసన జంట. 11 ఏళ్ల క్రితం అనగా 2012 జూన్14న చెర్రీ-ఉపాసన పెళ్లి ఘనంగా జరిగింది. రెండు పెద్ద కుటుంబాలు ఈ వేడుక ద్వారా ఒకటయ్యాయి. పెళ్లి సమయంలో ఈ జంటపై ఎన్నో విమర్శలు వచ్చాయి. కానీ వాటిని పటాపంచలు చేస్తూ చెర్రీ-ఉప్స్.. లవబుల్ కపుల్స్‌గా మారారు. చాలా మందికి ఆదర్శప్రాయంగా నిలిచారు. ఇప్పుడు ఈ దంపతులు మరో కొత్త జీవితానికి ఆహ్వానం పలకబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ తల్లిదండ్రులుగా ప్రమోట్ అవుతున్నారు. సుమారు పదేళ్ల తర్వాత ఉపాసన తల్లి కాబోతుంది. దీంతో ఇరు కుటుంబాల్లో సందడి నెలకొంది. రాబోయే యువరాజు,యువరాణి కోసం కుటుంబ సభ్యులే కాకుండా అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఇటీవల 11వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంది ఈ జంట. ఈ సందర్భంగా ఉపాసన ఓ ఆంగ్ల పత్రికతో ముచ్చటించి.. పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇప్పటి వరకు తాము అత్తమామలతో కాకుండా వేరు కాపురం ఉంటున్నామని, అయితే డెలీవరి తర్వాత అత్తాగారింటికి షిఫ్ట్ అవుతామంటూ వెల్లడించింది. ‘సాధారణంగా ఎవరైనా దంపతులు పిల్లలు పుట్టిన తర్వాత వేరే కాపురం పెడుతుంటారు. కానీ మేము దీనికి పూర్తి భిన్నం. ప్రస్తుతం.. రామ్,నేను విడిగా ఉంటున్నాం. బేబీ పుట్టిన తర్వాత మేము అత్తమామలతోనే ఉండాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే మా ఎదుగుదలకు పేరేంట్సే కారణం. వాళ్ల నుండి ఎన్నో గొప్ప విషయాలు నెరవేర్చుకున్నాం’అని చెప్పారు
‘పిల్లలు గ్రాండ్ పేరెంట్స్‌తో ఉంటే ఉన్నత లక్షణాలు అలవాటు పడతాయి. వారితో గడిపే ఆనందాన్ని మేము మా బిడ్డకు దూరం చేయాలనుకోవడం లేదు’ అని తెలిపారు. ప్రెగ్నెన్సీ గురించి చరణ్‌కు చెప్పినప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అయ్యారో చెబుతూ.. ‘ప్రెగ్నెంట్ అయ్యానేమోనని సందేహంగా ఉందంటూ మొదటిసారి చరణ్‌కు చెప్పాను. కన్ఫార్మ్ అయ్యాక ఆయన ఎంతో సంతోషించారు. తన స్టైల్‌లో సెలబ్రేట్ చేశారు’ అని ఆమె తెలిపారు. కాగా, ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలతో మెగా కోడలిపై రెట్టింపు గౌరవాన్ని ప్రదర్శిస్తున్నారు అభిమానులు. ఆమె వ్యాఖ్యలతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, జులైలో మెగా కుటుంబంలోకి వారసురాలు, వారసుడో రాబోతున్నారు.