ఈ మధ్యకాలంలో సినీతారలంతా ప్రేమ, పెళ్లి విషయాలలో అభిమానులకు షాకిస్తూనే ఉన్నారు. అభిమాన హీరో లేదా హీరోయిన్ ఇంకా ప్రేమలో పడలేదులే అనుకునేలోపు.. ఏకంగా ఎంగేజ్మెంట్ చేసుకొని ఫోటోలు షేర్ చేస్తున్నారు. తాజాగా యువనటి సోనారికా భాదోరియా.. తన బాయ్ ఫ్రెండ్ వికాస్ పరాశర్ తో ఎంగేజ్మెంట్ చేసుకొని ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసింది. కొంతకాలంగా వికాస్ తో డేటింగ్ లో ఉన్న సోనారికా.. వికాస్ బర్త్ డే సందర్భంగా ఓ విదేశీ బీచ్ లో వేలుకు రింగ్ తొడిగించుకుంది.
అలాగే కాబోయే భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. బీచ్ లో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వికాస్ బర్త్ డే సెలెబ్రేషన్స్ కి సంబంధించి ఓ వీడియో కూడా షేర్ చేసింది. అలాగే సోనారిక వికాస్ పరాశర్‌కి స్వీట్ బర్త్ డే నోట్ రాసింది. ‘బంగారం లాంటి మనసున్న అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నా మనస్సు, నా హృదయం, నా ఆత్మ అన్ని నీకే. నాకు ఎల్లప్పుడూ రక్షణ కలిగించే.. రక్షణగా చూసుకునే నీకు ఇవే నా శుభాకాంక్షలు కాబోయే భర్త వికాస్” అంటూ రాసుకొచ్చింది.
ఇదిలా ఉండగా.. సోనారిక గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. హిందీలో సీరియల్ నటి అయిన సోనారిక.. సినీ హీరోయిన్ గా డెబ్యూ చేసింది తెలుగులోనే. 2015లో నాగశౌర్య సరసన ‘జాదూగాడు’ అనే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన సోనారిక.. ఆ తర్వాత స్పీడున్నోడు, ఆడోరకం ఈడోరకం సినిమాలు చేసింది. ముంబైలోనే పుట్టి పెరిగిన ఈ భామ 2011లో ‘తుమ్ దేనా సాథ్ మేరా’ అనే టీవీ సీరియల్ తో నటిగా మారి, ‘దేవొంకి దేవ్ మహాదేవ్’ సీరియల్ లో పార్వతి దేవి పాత్ర పోషించి మంచి గుర్తింపు దక్కించుకుంది. మరి సోనారిక ఎంగేజ్మెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.