సినిమాల్లో నటించాలనే ఉత్సాహం ఉన్న వాళ్లు అవకాశాల కోసం ఎదురుచూసే సమయంలో వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుని వేధింపులకు పాల్పడిన ఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా ఓ హీరోయిన్ తను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చింది.
సమాజంలో మహిళలపట్ల వేధింపులు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. దేశంలో రోజు ఏదో ఓ మూలన అఘాయిత్యాలు చోటుచేసుకుంటున్నాయి. దీనిని నియంత్రించడానికి ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకువస్తున్నప్పటికి దారుణాలను అరికట్టలేకపోతున్నారు. ఈ విధమైన వేధింపులు సాధారణ మహిళలతో పాటు సెలబ్రిటీలు కూడా ఎదుర్కొంటున్నారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ ఒ ఇంటర్య్వూలో తను ఎదుర్కొన్న వేధింపుల గురించి ప్రస్తావించింది. తాను చెప్పిన ఆ షాకింగ్ విషయాలతో అందరూ షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన వివరాలను ఇప్పుడు చూద్దాం.
సినిమా ఇండస్ట్రీలో నటీనటుల మధ్య గాసిప్స్, రూమర్స్ చెక్కర్లు కొడుతుంటాయి. అవి వారి వ్యక్తిగత జీవితంతో పాటు, వృత్తిపరంగా కూడా నష్టాన్ని చేకూరుస్తాయి. సినిమాల్లో అవకాశాల కోసం వెతుకుతున్న క్రమంలో వేధింపులకు గురయ్యామని చాలా మంది నటీమణులు బహిరంగంగా చెప్పిన సందర్బాలు ఉన్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. బాలీవుడ్ లో సోనమ్ కపూర్ స్టార్ హీరోయిన్ పలు హిట్ సినిమాల్లో నటించి నాలుగు ఫిలిం ఫేర్ పురస్కారాలను కూడా పొందింది.
సోనమ్ కపూర్ యుక్త వయస్సులో ఉన్నప్పుడు లైంగిక వేధింపులకు గురైనట్లు చెప్పింది. తనకు పదమూడేళ్ల వయసు ఉన్నప్పుడు స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లానని తెలిపింది. థియేటర్ లో విరామ సమయంలో స్నాక్స్ కోసం బయటకు వచ్చిన సమయంలో ఓ వ్యక్తి ఆకస్మాత్తుగా వెనక నుంచి తన ఎదపై చేతులు వేశాడని చెప్పుకొచ్చింది. ఆ హఠాత్పరిణామంతో వణికిపోయానని తెలిపింది. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో గుక్కపెట్టి ఏడ్చానని తెలిపింది. మహిళలు వారి జీవితంలో ఏదో ఒక దశలో వేధింపులకు గురవుతున్నారని, ఆ దారుణాలపై పెదవి విప్పాలని వెల్లడించింది.