సాధారణంగా అభిమాన సినిమా తారలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో ఉంటుంది. అభిమాన తార ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెబుతుందా అని ఎదురు చూస్తుంటారు. అది కొత్త సినిమా అనౌన్స్ మెంట్ కావచ్చు లేదా పర్సనల్ లైఫ్ గురించి కావచ్చు. ఎప్పుడూ ఏదొక న్యూస్ అయితే ఎక్సపెక్ట్ చేస్తుంటారు ఫ్యాన్స్. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్, ఆనంద్ అహుజా దంపతులు గుడ్ న్యూస్ చెప్పారు.
సోషల్ మీడియా వేదికగా సోనమ్ కపూర్ ప్రెగ్నెన్సీ ఫోటో షేర్ చేస్తూ.. పుట్టబోయే బిడ్డకోసం తమ ప్రేమను బయటపెట్టారు. “నిన్ను ఉత్తమంగా పెంచేందుకు మా నాలుగు చేతులు.. నిన్ను అపురూపంగా కాపాడుకునేందుకు మా రెండు హృదయాలు.. నీకు ఎల్లప్పుడూ తోడుగా, అండగా ఉండేందుకు ఈ కుటుంబం.. నిన్ను స్వాగతించేందుకు ఇంకా వెయిట్ చేయలేకపోతున్నాయి” అంటూ పోస్ట్ చేశారు. అలాగే ఈ ఏడాదే తమ బిడ్డ పుట్టనుందని హ్యాష్ ట్యాగ్ ద్వారా తెలిపారు.
ప్రస్తుతం సోనమ్, ఆనంద్ అహుజా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు, అభిమానులు ఈ స్టార్ కపుల్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అనిల్ కపూర్ కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సోనమ్ కపూర్.. 2018లో బిజినెస్ మెన్ ఆనంద్ అహుజాను పెళ్లాడింది. ఇక సోనమ్ చివరగా ‘ఏకే వర్సెస్ ఏకే’ అనే సినిమాలో కనిపించింది. మరి సోనమ్ కపూర్ లేటెస్ట్ పిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.