బాలీవుడ్ సినిమాల్లో లిప్‌లాక్ సీన్లు ఉండటం సర్వ సాధారణం. ఇలాంటి సీన్లలో నటించటం ఆమెకు ఇష్టం లేకపోయింది. తన కుటుంబం గురించి ఆలోచించి హిందీ అవకాశాలను కాదనుకుంది.
సోనమ్ బజ్వా.. ఈ పేరుతో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు. కానీ, ఆమెను చూస్తే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తారు. డబ్బింగ్ సినిమాలతో పాటు రెండు స్టైట్ సినిమాలతో ఆమె తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తెలుగులో ఆమె బాబు బంగారం, ఆటాడుకుందాం రా! సినిమాల్లో చేశారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్‌ను సంపాదించలేకపోయాయి. తర్వాత కాలంలో ఆమె తన మాతృ భాష అయిన పంజాబీ సినిమాలకే పరిమితం అయ్యారు. హిందీలో కూడా కేవలం రెండు సినిమాలు మాత్రమే చేశారు. ఈ రెండు సినిమాల తర్వాత కూడా ఆమెకు హిందీలో చాలా అవకాశాలు వచ్చాయి.
అయినప్పటికి ఆమే ఆ అవకాశాలను స్వయంగా వద్దనుకున్నారు. ఇందుకు ఓ బలమైన కారణం ఉంది. చాలా వరకు హిందీ సినిమాల్లో లిప్‌లాక్ సీన్లు ఉండటం పరిపాటి. ముద్దు సీన్లలో నటించటం ఆమెకు నచ్చలేదు. అందుకే వచ్చిన అవకాశాలను వద్దనుకున్నారు. ముద్దు సీన్లలో నటించటం ద్వారా ఆమె తన కుటుంబం ఇబ్బందికర పరిస్థితుల్లో పడుతుందని భావించింది. అందుకే హిందీ సినిమాలకు ఓకే చెప్పటం మానేసిశారు. దీనిపై ఆమె మాట్లాడుతూ.. ‘‘నా సినిమాలు నా ఫ్యామిలీ చూస్తుందన్న స్ప్రహ ఉంది. అందుకే నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ముద్దు సీన్లలో నటించడానికి చాలా భయపడేదాన్ని.
దాన్ని నా వాళ్లు ఎలా తీసుకుంటారో నాకు తెలీదు. నా కుటుంబం దాన్ని ఓ సినిమా మాత్రమే అని అర్థం చేసుకోగలదా? ఇలాంటి చాలా ప్రశ్నలు నా బుర్రలో ఉండేవి. అందుకే చాలా హిందీ సినిమాలు వదలుకున్నాను’’ అని చెప్పుకొచ్చారు. కాగా, సోనమ్ బజ్వా 2013లో వచ్చిన ‘బెస్ట్ ఆఫ్ లక్’ అనే పంజాబీ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆమె హీరోయిన్‌గా నటించిన ‘కప్పల్’ అనే తమిళ కామెడీ సినిమా తెలుగులో ‘పాండవుల్లో ఒకడుగా’ డబ్ అయి రిలీజైంది. మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మరి, ముద్దులకు భయపడి సోనమ్ బజ్వా హిందీ సినిమాలు మానేయటంపై మీ అభిప్రాయలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.