తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది బాలీవుడ్ బ్యూటీలు నటించారు.. నటిస్తూనే ఉన్నారు. కొంతమంది మోడలింగ్ కెరీర్ ఆరంభించి ఇండస్ట్రీలోకి అడుగు పెడితే.. నటనపై ఫ్యాషన్ తో వచ్చేవారు, డబ్బు సంపాదించడానికి వచ్చేవారు కొంతమంది ఉన్నారు. బాలీవుడ్ బ్యూటీ సోనాలి బింద్రే తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి పేరు సంపాదించింది.
సోనాలి బింద్రే చాలా కాలం గ్యాప్ తర్వాత హిందీ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను రాబోతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సోనాలీ బింద్రే. సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొన్ని ఇబ్బందులు పడ్డానని.. కెరీర్ బిగినింగ్ సమయంలో తన కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయ్యిందని.. అందుకే కొన్ని సినిమాలు ఇష్టం లేకున్నా ఓకే చెప్పానని తెలిపింది. ఆ సమయంలో నిర్మాతలు తనకు మంచి రెమ్యూనరేషన్ ఇచ్చారు కనుకనే అలా చేయాల్సి వచ్చిందని చెప్పింది.
బాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగు పెట్టిన సోనాలీ బింద్రె తర్వాత తెలుగులో మురారి, ఖడ్గం,మన్మథుడు, ఇంద్ర వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. అప్పట్లో సోనాలి బింద్రే తన అందచందాలతో కుర్రాళ్ల మనసు దోచింది. స్టార్ హీరోలతో వరుస ఛాన్సులు కొట్టేసింది. ఇక వివాహం జరిగిన తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చింది. అప్పుడప్పుడు తన ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉండేది.
కొన్నాళ్ల క్రితం ఆమె క్యాన్సర్ బారిన పడింది. అమెరికాలోని న్యూయార్క్‌లో చికిత్స తీసుకొని కోలుకుంది. ఇండస్ట్రీ నుంచి దూరమైన తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సోనాలీ బింద్రే బుల్లితెరపై అడుగు పెట్టింది. తనకు నచ్చిన వెబ్ స్టోరీస్ లో నటిస్తానని అంటుంది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.