Sonali Bendre Denies Rumours About Her Financial Status: సోనాలి బింద్రే.. ఒకప్పుడు బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. తెలుగులో కూడా ‘మురారి’, ‘ఖడ్గం’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’, ‘శంకర్‌దాదా ఎమ్‌బీబీఎస్’ వంటి పలు హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది సోనాలి బింద్రే. 2013లో హిందీలో వచ్చిన వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై, దొబార చిత్రంలో అతిథిగా కనిపించిన ఆమె క్యాన్సర్ మహమ్మారితో పోరాడి గెలిచింది. అమెరికాలో క్యాన్సర్‌కు చికిత్స చేయించుకుని కోలుకుని.. ఇండియా తిరిగొచ్చిన సోనాలి బింద్రే.. తాజాగా ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే వెబ్‌సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చింది.
ఇటీవల జూన్ 10న ఈ వెబ్ సిరీస్ జీ5లో విడుదలైంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న సోనాలి బింద్రే గత కొంత కాలంగా తనపై వస్తున్న పుకార్లపై స్పందించింది. అవన్ని అవాస్తవం అని తేల్చి చెప్పింది. ఇంతకు విషయం ఏంటంటే.. సోనాలి బింద్రే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందని, అందుకే ఆమె మళ్లీ సినిమాలు చేసేందుకు రెడీ అయ్యిందంటూ బాలీవుడ్ మీడియాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆఫర్స్ కావాలంటూ దర్శక-నిర్మాతలకు ఆమె విజ్ఞప్తి చేసుకుంటుందంటూ బీ-టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Allu Arjun: క్రేజీ అప్‌డేట్ : అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ ప్యాన్ ఇండియా మూవీ!
ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనాలి బింద్రే ఈ వార్తలను కొట్టి పారేసింది. తను ఆర్థికంగా అన్ని విధాలుగా బాగున్నానని, ఆఫర్స్ కావాలని అడుక్కోవాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేసింది. ‘‘నాకు డబ్బు సమస్య ఉందంటూ వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. అలాగే తెలుగులో జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో రాబోయే ఎన్టీఆర్ 30 సినిమాల్లో నేను నటిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో సైతం నిజం కాదని’’ వెల్లడించింది. ‘ప్రస్తుతం నేను ఎలాంటి సినిమాలకు సంతకం చేయలేదు. మంచి కథ, పాత్ర నచ్చితే తప్పకుండ చేస్తాను’ అని తెలిపింది. సోనాలి బింద్రే వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: నరేష్ మూడో భార్య షాకింగ్ కామెంట్స్.. నేను ఇంకా ఆయన భార్యనే.. విడాకుల పేపర్లపై సంతకం చేయలేదు!