Sona Mohapatra: ప్రపంచంలో ఏ దేశంలో లేని హీరోల ఆరాధన ఇండియాలో ఉంది. ఇక్కడి ఫ్యాన్స్ తమ హీరోలను దేవుళ్లలాగా భావిస్తారు. తమ హీరోను ఎవరైనా పల్లెత్తు మాటన్నా సహించరు. మాటలన్న వారి మీద విరుచుకుపడతారు. ఆ అవతలి వాళ్లు ఆడ,మగ అన్న సంగతి ఆలోచించరు.. తమ కోపాన్ని చూపించేస్తారు. సాధారణ పౌరులు కావచ్చు.. సెలబ్రెటీలు కావచ్చు ఎవర్నీ వదలరు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు చాలానే ఉన్నాయి. గతంలో బాలీవుడ్ ప్రముఖ సింగర్ సోనా మోహపాత్ర విషయంలోనూ సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ చాలా దురుసుగా ప్రవర్తించారు. ఆమె మామూలుగా అన్న వ్యాఖ్యలకు కూడా టార్చర్ చూపించారు. ఈ ఘటన జరిగి సంవత్సరాలు గడుస్తున్నా సోనా.. సల్మాన్ ఫ్యాన్స్ వేధింపుల్ని మర్చిపోలేకపోతోంది. తాజాగా, మీడియా ముందు అప్పట్లో తనకు ఎదురైన వేధింపులను చెప్పుకొస్తూ కంటతడి పెట్టుకుంది. సోనా మాట్లాడుతూ… ‘‘ నేను చేసిన ఓ ట్వీట్‌పై ఆయన ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు.
నన్ను చాలా దారుణంగా ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. నన్ను చంపుతామని బెదిరించారు. సామూహిక అత్యాచారం చేస్తామని కూడా బెదిరించారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే.. టిఫిన్ బాక్సుల్లో మలాన్ని నింపి.. సింగింగ్ స్టూడియోకు పంపేవారు. నా ఫొటోలను మార్ఫ్ చేసి పో*ర్న్ సైట్లలో పెట్టారు. ఇలా రెండు నెలల పాటు నానా తిప్పలు పెట్టారు. నేను చాలా ఏడ్చేదాన్ని. అది చూసి నాభర్త బాధపడేవాడు ’’ అని చెప్పుకొచ్చారు. కాగా, సల్మాన్ ఖాన్ నటించిన ‘భరత్’ సినిమాలో మొదట ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా ఫైనల్ అయింది. ఆమెతో అగ్రిమెంట్ కూడా అయిపోయింది. అయితే, సినిమా షూటింగ్ మొదలయ్యే సమయానికి ఆమె సినిమా నుంచి తప్పుకున్నారు.
నిక్ జోనస్‌ని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే 2019లో సోనా.. ప్రియాంకను ఉద్ధేశిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో.. ‘‘ ప్రియాంక తన జీవితంలో చేయాల్సిన గొప్పపనులు చాలా ఉన్నాయి. నిజమైన పురుషులతో కలుసుండాల్సిన అవసరం ఉంది. ఆమె జీవితం నుంచి మహిళలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది’’ అని పేర్కొన్నారు. సోనా.. సల్మాన్‌ను నేరుగా అనకపోయినా ఈ ట్వీట్ ఆయన్ని ఉద్ధేశించిందేనని ఫ్యాన్స్ భావించారు. ఇక, అప్పటినుంచి ట్రోల్స్ చేయటం మొదలుపెట్టారు. మరి, సోనాపై సల్మాన్ ఫ్యాన్స్ వేధింపులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Ante Sundaraniki OTT Release: ‘అంటే సుందరానికి’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్..?