తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ 5వ సీజన్.. ప్రేక్షకులకు ఎంత స్పెషల్ గా నిలిచిందనే చెప్పాలి. కంటెస్టెంట్ లుగా పాల్గొన్న కొందరిపై ప్రశంసలు వినిపించగా, మరికొందరి పై విమర్శలు ఏ స్థాయిలో వినిపించాయో తెలిసిందే. బిగ్ బాస్ అనంతరం కంటెస్టెంట్స్ అంతా ఎవరి కెరీర్ పరంగా వారు బిజీ అయిపోయారు. అయితే.. బిగ్ బాస్ తర్వాత అందరూ మళ్లీ కలవడం అనేది అరుదుగా జరుగుతుంది.
తాజాగా బిగ్ బాస్ సీజన్ 4, సీజన్ 5కి చెందిన కంటెస్టెంట్స్ అందరూ ‘బిగ్ బాస్ ఉత్సవం‘ అనే కార్యక్రమంతో కలుసుకున్నారు. స్టార్ మా ఛానల్లో ఫిబ్రవరి 20న ప్రసారం కానున్న ఈ ప్రోగ్రామ్ నుండి తాజాగా ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ సోహెల్.. కంటెస్టెంట్స్ అందరితో ఆడిపాడి.. చివరిగా అందరితో కలిసి బిర్యానీ దావత్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సోహెల్ దావత్ ఇచ్చిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ బిగ్ బాస్ ఉత్సవం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.