సాధారణంగా ఒకరి చదువు, సబ్జెక్టు విషయంలో తలదూర్చడం అనేది ఎన్ని తంటాలు తెచ్చిపెడుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనకు నచ్చింది మాత్రమే మంచి సబ్జెక్టు, రాని సబ్జెక్టుల కోసం ఎందుకు పరిగెత్తడం.. అని అన్నారంటే వారి తెలివి తక్కువ తనానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఎవరికైనా స్కూల్, కాలేజీలో ఫేవరేట్ సబ్జెక్టులు ఉంటాయి. అలాగని అన్నీ ఫేవరేట్ అని చెప్పలేం కదా.. అలాగే మనకు వచ్చినవే ఫేవరేట్ అనుకోని.. మిగతా సబ్జెక్టులను నిందించడం పద్ధతి కాదు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ఫేవరేట్ సబ్జెక్టుల గురించి మాట్లాడిన బాలీవుడ్ యంగ్ హీరోయిన్.. తనకు రాదని మ్యాథ్స్ సబ్జెక్టును ఘోరంగా నిందించి సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటుంది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా..? అందాలతార శ్రీదేవి తనయ జాన్వీ కపూర్. ఎంత సెలబ్రిటీ అయినా తనకు రాని సబ్జెక్టుపై కామెంట్స్ చేయడంతో ప్రస్తుతం హీరోయిన్ ట్రోల్స్ కి గురవుతోంది. మరి చేసిన కామెంట్స్ ఏంటనే వివరాల్లోకి వెళ్తే..
‘ధఢక్’ సినిమాతో బాలీవుడ్ లో హీరోయిన్ గా డెబ్యూ చేసింది జాన్వీ కపూర్. మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సొంతం చేసుకున్న జాన్వీ.. వరుస సినిమాలతో బిజీ అవుతోంది. ఎప్పటికప్పుడు తన అందాలను షో చేస్తూ సోషల్ మీడియాలో కూడా అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. ఈ క్రమంలో తాజాగా ‘గుడ్ లక్ జెర్రీ’ అనే సినిమా చేసింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ.. మ్యాథ్స్ పై కామెంట్స్ చేసింది.
స్కూల్ లో చదివేటప్పుడు మీ ఫేవరేట్ సబ్జెక్టులు ఏంటని అడిగితే చరిత్ర, లిటరేచర్ అంటే చాలా ఇష్టమని చెప్పిన జాన్వీ.. ఇష్టంలేని సబ్జెక్టు అనగానే మ్యాథ్స్ అని ఠక్కున చెప్పేసింది. ఎందుకని అడగగా.. కాలిక్యులేటర్ కనిపెట్టిన తర్వాత లెక్కలు చేయడం చాలా సులభమైంది. ఇంకా కష్టపడి ఆల్జీబ్రాను నేర్చుకోవడంలో ఉపయోగమేంటీ? గణితం కోసం ఎందుకు అంతలా తలలు బద్దలు కొట్టుకుంటారో అర్థం కాదు. కానీ.. చరిత్ర, సాహిత్యం కల్చర్ తెలియజేస్తాయని చెప్పుకొచ్చింది.
దీంతో జాన్వీ మాటలు నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజన్స్ జాన్వీ కామెంట్స్ పై విరుచుకుపడుతున్నారు. ‘లక్షల ఫీజు కట్టి ఇంటర్నేషనల్ స్కూళ్లలో చదివిన వారి నాలెడ్జ్ ఎలా ఉంటుందో ఇదే ఫ్రూఫ్’.. మీరు ఉన్న దయనీయ స్థితికి మ్యాథ్స్‌ను ఎందుకు నిందిస్తారు.. అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. జాన్వీ నటించిన ‘గుడ్ లక్ జెర్రీ’ మూవీ జూలై 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి మాథ్స్ గురించి జాన్వీ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Who is this? pic.twitter.com/ow8hvWdToh
— Abhijit Majumder (@abhijitmajumder) July 17, 2022