సాధారణంగా కొన్ని సినిమాలకు సీక్వెల్స్ వస్తున్నాయంటే.. ప్రేక్షకులలో ఆ క్యూరియాసిటీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ముఖ్యంగా థ్రిల్లర్ మూవీస్ విషయంలో ఉత్కంఠ అనేది మామూలుగా ఉండదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఓ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాక దాని సీక్వెల్ పై క్రియేట్ అయ్యే అటెన్షన్ వేరు. అలాంటి అటెన్షన్ ని సంపాదించుకున్న సినిమా ‘హిట్ 2‘. 2020లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న విశ్వక్ సేన్ ‘హిట్’ సినిమాకి సీక్వెల్ గా హిట్ 2 తెరకెక్కింది. క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమాని డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించగా.. అడివి శేష్ ఇందులో హీరోగా నటించాడు.
తాజాగా బాక్సాఫీస్ వద్ద ‘హిట్ 2’ సినిమా పేరు మార్మోగిపోతోంది. టీజర్, ట్రైలర్స్ తోనే అంచనాలు పెంచేసిన ఈ సినిమా.. డిసెంబర్ 2న వరల్డ్ వైడ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలైన మొదటి షో నుండే మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే.. ట్రైలర్ తో పాటు ప్రమోషన్స్ లో కూడా సినిమాలో విలన్(సీరియల్ కిల్లర్) ఎవరు? అనే విషయాన్నీ ఎక్కడ ప్రస్తావించలేదు. దీంతో ఈసారి హిట్ 2లో విలన్ ఎవరా? నెక్స్ట్ హిట్ 3లో హీరోగా ఎవరిని చూడబోతున్నాం? అనే ఆసక్తితో ఫుల్లుగా ప్రిపేర్ అయిపోయి థియేటర్లకు వెళ్తున్నారు ప్రేక్షకులు. అదీగాక ట్రైలర్ లో అడివి శేష్ క్యారెక్టర్.. డిఫరెంట్ అమ్మాయిల బాడీ పార్ట్స్ ఒకేచోట పేర్చడం అనే పాయింట్ రైస్ చేయడంతో మరింత సస్పెన్స్ క్రియేట్ అయ్యింది.
ఓపెనింగ్ షోలకు ఫుల్ ఎక్సయిట్ మెంట్ తో థియేటర్స్ లో సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ లో ఫుల్ పాజిటివ్ రివ్యూస్ తో హైప్ క్రియేట్ చేశారు. కట్ చేస్తే.. అదే ట్విట్టర్ లో ఈవెనింగ్, నైట్ షోస్ చూసిన ప్రేక్షకులు ‘హిట్ 2’కి సంబంధించి ఓ విషయంలో బాగా డిసప్పాయింట్ అయినట్లు చెబుతున్నారు. థ్రిల్లర్ సినిమాలలో హీరోలు ఎంత పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ అయినా.. ఆ పోలీస్ ని వరుస హత్యలతో అల్లాడించే సీరియల్ కిల్లర్ పైనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. క్లైమాక్స్ కి వచ్చేసరికి సీరియల్ కిల్లర్ ఫేస్ రివీల్ చేయగానే మైండ్ బ్లాక్ అయ్యే సీన్ ఎక్సపెక్ట్ చేస్తారు. అలాంటి అంచనాలతో వెళ్లిన ప్రేక్షకులను హిట్ 2 సినిమా.. ఆ ఒక్క విషయంలో నిరాశకు గురిచేసినట్లు ట్విట్టర్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
వరుస హిట్స్ తో తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ క్రియేట్ చేసుకున్న అడివి శేష్ ‘హిట్ 2’లో హీరో అన్నప్పుడే జనాలు చాలా ఎక్సయిట్ అయ్యారు. అదీగాక హిట్ సిరీస్ ని ఏకంగా 7 సీక్వెల్స్ గా ప్లాన్ చేసినట్లు డైరెక్టర్ క్లారిటీ ఇచ్చాడు. అంత బిగ్ ప్లాన్ తో.. ఒక్కో సీక్వెల్ కోసం నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ ఉన్నప్పుడు.. విలన్స్ గా స్టార్ కాస్ట్ ని తీసుకుంటే బాగుంటుందని ఆడియెన్స్ అభిప్రాయం. హిట్ 2లో స్టోరీ, ట్విస్టులు.. హీరో క్యారెక్టర్.. థ్రిల్లింగ్ మూమెంట్స్.. అన్ని బాగానే ఉన్నాయి.. కానీ, ఒక్క విలన్ విషయంలోనే ట్రోల్స్ మొదలయ్యాయి. ఎందుకంటే.. అడివి శేష్ హీరో అన్నప్పుడు అతనికి సరితూగే విలన్ క్యారెక్టర్ నే ఎవరైనా ఎక్సపెక్ట్ చేస్తారు. ఇందులో ఒక స్టార్ యాక్టర్ ని విలన్ గా పెట్టి ఉంటే.. సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండేదని టాక్ బలంగా వినిపిస్తోంది.
మరి ఎలాగో హిట్ 2 క్లైమాక్స్ లో.. సీక్వెల్ 3 హీరో ఎవరో రివీల్ చేశారు. కాబట్టి, నెక్స్ట్ పార్ట్ లో విలన్ క్యారెక్టర్ మరింత స్ట్రాంగ్ గా, ఎవరు ఎక్సపెక్ట్ చేయని స్టార్ ఉంటాడేమోనని ఆశిస్తున్నట్లు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాని కెమెరా వర్క్ తో మణికందన్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో స్వీవార్ట్ జాన్ యేడూరి నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. హిట్ 2 మూవీని హీరో నానితో పాటు ప్రశాంతి తిపర్నేని సంయుక్తంగా నిర్మించారు. కాగా, ఈ సినిమాలో అడివి శేష్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. డాక్టర్ కం డైరెక్టర్ శైలేష్ కొలను.. హిట్ 3ని ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.