సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే తెలుగు సీనియర్ నటీమణులలో ప్రగతి ఒకరు. తెలుగు ప్రేక్షకులకు ప్రగతి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. సినీ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలకు పైగా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక ఈ మధ్యకాలంలో ట్రెండ్ తగ్గట్టుగా జీవించాలని.. తనని తాను అప్ డేట్ చేసుకొని సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తోంది.
సోషల్ మీడియాలో ప్రగతి ఎంత యాక్టీవ్ గా ఉంటుందో అందరికి తెలిసిందే. ఎప్పటికప్పుడు తన డాన్స్, ఫోటోషూట్స్, ట్రెండింగ్ రీల్స్ తో నెట్టింట ఫ్యాన్స్ ని ఫిదా చేస్తోంది. అప్పుడప్పుడు ఆమె వర్కౌట్ వీడియోలు కూడా పోస్ట్ చేస్తుంది. ఇటీవలే ప్రగతి తన బర్త్ డేని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంది. ఆ ఫోటోలు నెట్టింట ఫుల్ వైరల్ అయ్యాయి.. అలాగే పలు చర్చలకు కూడా దారితీశాయి. అయితే.. తన బర్త్ డే సందర్భంగా ప్రగతి ధరించిన డ్రెస్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. సీనియర్ నటి, ఈ వయసులో కూడా ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడం అవసరమా..? అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ప్రగతి గ్లామరస్ డ్రెస్ ధరించడం అనేది కొత్త కాదు. ఆమె గ్లామర్ ఫీల్డ్ లో ఉంది కాబట్టి ఇవన్నీ సర్వసాధారణం. అలాగని సెలబ్రిటీల డ్రెస్సింగ్ స్టైల్ పై కామెంట్ చేసే హక్కు ఎవరికీ లేదు. అది వారి పర్సనల్ విషయం. అదీగాక ప్రగతి ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ.. రీల్స్, వర్కౌట్ వీడియోలలో డ్రెస్సింగ్ స్టైల్ స్టైలిష్ గానే మెయింటైన్ చేస్తోంది. కాబట్టి ఆమె డ్రెస్ సెన్స్ పై కామెంట్ చేయడం కరెక్ట్ కాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.