గత కొన్ని రోజులుగా శోభిత ధూళిపాళ్ల పేరు నిత్యం వార్తల్లో హల్చల్ చేస్తోంది. మరీ ముఖ్యంగా నాగచైతన్యతో ఈ బ్యూటీ డేటింగ్ చేస్తోందనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఇక తాజాగా శోభిత చేసిన ఇన్ స్టా పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
శోభిత ధూళిపాళ్ల.. మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్న తెలుగు అమ్మాయి. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. హీరోయిన్‌గా రాణిస్తోంది. కేవలం టాలీవుడ్‌లోనే కాక.. బాలీవుడ్, కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ.. నటిగా గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లోనే కాక వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తూ.. కెరీర్‌లో ఫుల్ బిజీగా సాగుతోంది. ఇక సినిమాల సంగతి పక్కకు పెడితే.. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలతో కూడా నిత్యం హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది శోభిత. ఇక గత కొంతకాలంగా ఈ బ్యూటీ డేటింగ్ వార్తలతో హల్చల్ చేస్తోంది. శోభిత.. నాగ చైతన్యతో డేటింగ్‌లో ఉంది అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి తోడు లండన్‌లో వీరిద్దరూ కలిసి డేట్‌కు వెళ్లిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.
ఇక తాజాగా శోభిత ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్.. నెట్టింట వైరల్‌గా మారింది. సమంతను పెళ్లి కుమార్తెగా చూసి కన్నీళ్లు ఆగలేదు అంటూ శోభిత చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. సమంతను పెళ్లి కుమార్తెగా చూసి.. శోభిత ఏడవడం అనే మాటలు వైరల్‌గా మారాయి. మరి శోభిత మాటల వెనక ఉద్దేశం ఏంటి అంటే..
తాజాగా శోభిత.. ఓ పెళ్లికి హాజరయ్యింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి నెట్టింట వైరల్‌గా మారాయి. ఫొటోలు షేర్ చేస్తూ.. ‘‘మెహందీ ఫంక్షన్.. ఎన్నో కొత్త ముఖాలు. ఎంతో ఆశ్చర్యంగా మరింత ఆనందగా.. ఒకరినొకరు చూసుకుంటున్నాయి. నేను మాత్రం ఇంకా రెడీ అవ్వలేదు. నా ప్రాణ స్నేహితురాలు కూడా ఇంకా రెడీ అవ్వకుండ నాకు తోడుగా ఉంది. నేను తారా ఖన్నా(శోభిత నటించిన మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్ పాత్ర)లా మారిపోయి.. ఏర్పాట్లన్ని దగ్గరుండి చూసుకున్నాను. అందుకే నేను రెడీ అవ్వడానికి టైం దొరకలేదు. కానీ పెళ్లి మండపంలో మొదటిసారి సమంతను పెళ్లి కుమార్తెగా చూడగానే.. నాకు ఏడుపాగలేదు. ఇక్కడ మెహంది పెట్టడం వీలు కాలేదు. కానీ లంచ్ మాత్రం సూపర్‌గా ఉంది’’ అంటూ రాసుకొచ్చింది.
దీనితో పాటు.. సంగీత్ వేడుకకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేసింది శోభిత. వీటిని చూసిన జనాలు.. ఇవి నిజంగా పెళ్లి ఫొటోలేనా.. లేక ఏదైనా షూటింగ్ సందర్భంగా తీసినవా అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు సమంత ఎవరు.. ఆమెను చూసి నీకు కన్నీరాగపోవడం ఏంటి.. మీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ లేక.. బంధువులా.. మొత్తం మీద సమంత పేరు వాడి.. ఒక్కసారి ట్రెండింగ్‌లోకి వచ్చావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజనులు. ఇక శోభిత షేర్ చేసిన వివరాలను బట్టి.. పెళ్లి కుమార్తె పేరు సమంత అని.. ఆమె డాక్టర్ అని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం శోభిత నటించిన పొన్నియన్ సెల్వన్-2 విడుదలకు రెడీగా ఉంది. తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శోభిత నార్త్ బ్యూటీలని మించేలా గ్లామర్ షోలో రెచ్చిపోతోంది.