తెలుగు ఇండస్ట్రీలో బాలీవుడ్ రిమేక్ చిత్రాలు మంచి విజయాలు అందుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల పవన్ కళ్యాన్ నటించిన ‘వకీల్ సాబ్’ హిందీలో పింక్ అనువాద చిత్రం. ఈ చిత్రంలో బిగ్ బీ అమితాబచ్చన్ నటించారు. హిందీలో మంచి విజయం అందుకున్న ‘అంధాధూన్’తెలుగులో నితిన్ హీరోగా ‘మాస్ట్రో’తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇది నితిన్ కి 30వ చిత్రం. కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ‘మాస్ట్రో’ను నిర్మాతలు ఎన్. సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. సెప్టెంబర్ 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ముందుగా మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ తేదీని వాయిదా వేసి సెప్టెంబర్ 17న ఈ మూవీని నేరుగా డిస్నీ హాట్స్టార్లో ప్రీమియర్ చేయబోతున్నారు.
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘మాస్ట్రో’ సినిమా రూపొందింది. నితిన్ జోడీగా నభా నటేశ్ నటించిన ఈ సినిమాలో, తమన్నా ఒక కీలకమైన పాత్రను పోషించింది. ఈ ఏడాది నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన ‘రంగ్ దే’ చిత్రం ఆశించినంత ఫలితం రాలేదన్న విషయం తెలిసిందే. అంతకు ముందు ‘చెక్’ మూవీ కూడా పెద్దగా ఫలితం రాలేదు. ఈ నేపథ్యంలో నితిన్ మరో వినూత్న ప్రయోగం చేయబోతున్న విషయం తెలిసిందే. తాను నటిస్తున్న ‘మాస్ట్రో’ చిత్రంలో ఓ అంధుడి పాత్రలో నటిస్తున్నాడు నితిన్. బాలీవుడ్ లో వచ్చిన అంధధూన్ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా గుడ్డివాడి పాత్రలో నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు పొందాడు.
ఆయనకు పలు అవార్డులు.. రివార్డులు కూడా వచ్చాయి. నితిన్ నటిస్తున్న మాస్ట్రో నుంచి ‘స్నీక్ పీక్’ను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో అంధుడిగా నటించిన నితిన్ పియానో వాయిస్తున్నాడు. ఆ పియానో పై సంగీత దిగ్గజం మాస్ట్రో.. ఇళయరాజా ఫోటో కన్పించడం విశేషం. అయితే పియానో వాయిస్తున్న సమయంలో ఒక కీ పని చేయకుండా పోతుంది. నితిన్ ఇది మళ్ళీ రిపేర్ చేయించాలా ? అంటూ అవసహనం వ్యక్తం చేయడం.. ఆ తరువాత హీరో తన వాచ్ లో నుంచి ఏదో తీస్తుండగా… వీడియోను ఎండ్ చేశారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలుస్తుందని నితిన్ భావిస్తున్నాడు.