సినీ లవర్స్‌కు సెప్టెంబర్ నెల పెద్ద పండగే అని చెప్పాలి. ఎందుకంటే ఓ వైపు వినాయక చవితి, మరో వైపు భారీ సినిమాలు సందడి. ఆ నెల మొత్తం సంబరాలతో మునిగిపోనుంది.
సినీ లవర్స్‌కు సెప్టెంబర్ నెల పెద్ద పండగే అని చెప్పాలి. ఎందుకంటే ఓ వైపు వినాయక చవితి, మరో వైపు భారీ సినిమాలు సందడి. ఆ నెల మొత్తం సంబరాలతో మునిగిపోనుంది. ఖుషి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, స్కంద, సలార్, వంటి పాన్ ఇండియా చిత్రాలు థియోటర్లలో దుమ్ముదులపడానికి సిద్దం అవుతున్నాయి. అయితె ఇందులో “స్కంద” గురించి మాట్లాడుకుందాం. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, శ్రీలీల కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ స్కంద. వచ్చే నెల 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న సంగతీ తెలిసిందే. ఈ సినిమాను యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబందించిన అప్ డేట్ చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగస్టు 26న అంటే శనివారం రోజున శిల్పకళావేదికలో ప్లాన్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇది రాపో ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అని చెప్పాలి. అయితే ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ఒక పెద్ద హీరో వస్తున్నట్లు తెలుస్తోంది.
నందమూరి బాలకృష్ణతో అఖండతో హిట్ కొట్టిన డైరెక్టర్ బోయపాటి శ్రీను ఇప్పుడు మరో ఫుల్ లెంగ్త్ మాస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల్ని అలరించబోతున్నారు. అయితే ఈ ఈవెంట్ కు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే నందమురి ఫ్యాన్స్ కి పండగే. దర్శకుడు బోయపాటి శీనుతో బాలకృష్ణకున్న స్నేహం, అనుబంధం అందరికీ తెలిసిందే. వీరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ వంటి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. ఆ బాండింగ్ తోనే బాలయ్య కూడా ఓకే చెప్పినట్లు నెట్టింట అనుకుంటున్నారు. ఇదే నిజమైతే బాలయ్య ఫ్యాన్స్ కి పండగే అని చెప్పవచ్చు.
స్కందకు చాలా సవాళ్లు ఎదురు కానున్నాయి. వారం ముందు షారుఖ్ ఖాన్ జవాన్ వచ్చి ఉంటుంది. సెప్టెంబర్ 15నే చంద్రముఖి 2, మార్క్ ఆంటోనీలు ఉన్నాయి. డబ్బింగ్ హక్కులకు బాగానే డిమాండ్ ఉంది. కాబట్టి థియేటర్ల సమస్యను అధిగమిస్తూనే అదిరిపోయే టాక్ తెచ్చుకుంటే స్కందని ఈ కాంపిటీషన్ ఏమీ చేయలేదు. శ్రీలీల నృత్యాలు, గ్లామర్ పబ్లిసిటీ పరంగా బాగానే ప్లస్ అవుతోంది. ది వారియర్ డిజాస్టర్ తర్వాత రామ్ ఎంతో నమ్మకంతో చేస్తున్న స్కంద సక్సెస్ అయితే డబుల్ ఇస్మార్ట్ బిజినెస్ కి మరింత హెల్ప్ అవుతుంది. చూడాలి మరి స్కంద ఎలాంటి విజయం సాధిస్తుందో.