ఘట్టమనేని సితార.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ల ముద్దుల కూతురు. చిన్న వయసులోనే తన ఆట పాటలు, చలాకీతనంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సితార. అంతే కాదు సోషల్ మీడియాలో సితార చాలా యాక్డీవ్ గా ఉంటుంది. ఆమెను మహేష్ బాబు, నమ్రతలు కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. తన సింగింగ్, డాన్సింగ్ టాలెంట్ చూపిస్తూ మహేష్ అభిమానులను హుషారెత్తిస్తుంటుంది. తాజాగా తన నాన్నమ్మ, తాతయ్యలతో సండే ను స్పెషల్ గా గడిపింది. దీనికి సంబంధించిన ఫోటోలను నటి నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇటీవల సితార తన నాన్నమ్మ ఇందిరా దేవీ పుట్టిన రోజు సందర్భంగా.. “హ్యాపీ బర్త్ డే నాన్నమ్మ.. నీలా ఎవ్వరూ ఉండరు. లవ్ యూ సో మచ్” అంటూ ఫోటో సోషల్ మీడియాలో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగ నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. సితార.. తన తాత, నాన్నమ్మలతో సండేను సరదగా గడిపింది. “మా సండే బుక్ అయింది. మీరు..మీ ప్రియమైన వారితో గడిపేందుకు సమయం కనిపెట్టండి. ఇది అన్నిటిని సమానం చేస్తుంది” అంటూ సూపర్ స్టార్ కృష్ణా, ఆయన భార్య ఇందిరా దేవి లతో సితార , గౌతమ్ లు ఉన్న పిక్ ను షేర్ చేసింది. బంధాల విలువల నమ్రత చక్కగా చెప్పిందని ఇది చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మీ అభిప్రాయాలను కామెంట్స రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.