సూపర్ స్టార్ మహేష్ బాబు.. టాలీవుడ్‌లో టాప్ హీరో మాత్రమే కాక.. మంచి మనసున్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఎందరో చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి.. వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. ఇప్పటి వరకు ఎన్నో వందల మంది.. చిన్నారుల ప్రాణాలు కాపాడాడు మహేష్ బాబు. సూపర్ స్టార్ మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. నూతన సంవత్సరం నుంచి.. తన సేవలను మరింత మందికి చేరువ చేసే పనిలో భాగంగా.. మరో మంచి పనికి శ్రీకారం చుట్టాడు మహేష్ బాబు. ఈ మేరకు సోషల్ మీడియాలో మహేష్ బాబు గారాల పట్టి సితార.. ప్రకటన చేయడమే కాక.. తన వంతుగా ఏం చేయబోతుందో.. వివరిస్తూ.. వీడియో పోస్ట్ చేసింది. ప్రసుత్తం ఇది సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు..
నూతన సంవత్సరం సందర్భంగా మహేష్ బాబు.. తన సేవాకార్యక్రమాలను మరింత మందికి చేరువ చేసేందుకుగాను మంచి నిర్ణయం తీసుకున్నారు. తన సేవాకార్యక్రమాల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె సితార.. సోషల్ మీడియాలో వెల్లడించింది. వెబ్‌సైట్ గురించి ప్రకటిస్తూ.. తన వంతుగా.. పాకెట్ మనీని డొనేట్ చేస్తున్నట్లు ప్రకటించింది సితార.
‘‘ఈ నూతన సంవత్సరంలో.. మా అధికారిక వెబ్‌సైట్‌ను ప్రారంభించడం పట్ల మేం సంతోషిస్తున్నాం. ఫౌండేషన్ తరఫున అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు’’ అని పోస్ట్ చేసింది సితార. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక న్యూఇయర్ సందర్భంగా.. మహేష్ కుటుంబంతో కలిసి స్విట్జర్లాండ్ వెళ్లాడు. అక్కడే నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నాడు. మరి మహేష్ బాబు చేస్తున్న మంచి పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
In our endeavour to create a world where children survive and thrive, we are happy to be launching our official website this New Year! https://t.co/jY6B4gXMPd
For the children…to the children ❤️#MBFoundation wishes you all a happy new year 2023!@urstrulymahesh pic.twitter.com/MdOhnee1sr
— Mahesh Babu Foundation (@MBfoundationorg) January 1, 2023