పిల్లలు యాక్టివ్ గా ఉంటే తల్లిదండ్రులకు ఆనందంగా ఉంటుంది. పాటలు పాడడం, డ్యాన్స్ చేయడం వంటివి చేస్తుంటే అవి చూసి మురిసిపోతుంటారు. ఈ విషయంలో సెలబ్రిటీలు, సాధారణ మనుషులు అని తేడా లేదు. సెలబ్రిటీలు కూడా సాధారణ మనుషుల్లానే పిల్లలు చేసే పనులను చూసి మురిసిపోతుంటారు. తాజాగా మహేష్ బాబు కూడా తన కూతురు సితార విషయంలో అలానే ఫీలయ్యారు. తాను నటించిన సినిమాలో ఓ పాటకు తన కూతురు డ్యాన్స్ చేస్తుంటే.. ఆ మూమెంట్ ని అభిమానులతో పంచుకోకుండా ఉండలేకపోయారు. సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తన ఆనందాన్ని వ్యక్తం చేశారు మహేష్ బాబు.
మహేష్ బాబు నటించిన సినిమాల్లో అతడు సినిమా ఒక క్లాసిక్ గా నిలిచింది. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని సినిమా అది. ఆ సినిమాలో ప్రతీ పాట సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా పిల్ల గాలి అల్లరి పాట అయితే చాలా పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా పాటకే మహేష్ బాబు కూతురు సితార డ్యాన్స్ చేసింది. ‘ఏదో నెమలి నాట్యమాడినట్టు, లేడీ చెంగు చెంగున గెంతులు వేసినట్టు.. చాలా డెడికేటెడ్ గా, చాలా బాగా డ్యాన్స్ వేసిందిరా బుజ్జి’ అని అనిపిస్తుంది. సితార డ్యాన్స్ చూసిన నెటిజన్లు డాన్స్ సూపర్ వేశావంటూ పొగిడేస్తున్నారు. ఆట సందీప్, అనీ మాస్టర్లు కూడా సితార డ్యాన్స్ కి ఇంప్రెస్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూస్తుంటే ఘట్టమనేని ఇంటి నుంచి హీరోయిన్ కూడా వచ్చేటట్టు కనబడుతోంది. మరి సితార డ్యాన్స్ చూస్తుంటే.. హీరోయిన్ గా రాణించే అవకాశం ఉందంటారా? మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.