'సీతారామం' హీరోయిన్ కన్నీళ్లు పెట్టుకుంది. చాలా బాధపడ్డానంటూ ఓ ఫొటోని పోస్ట్ చేసింది. దీంతో ఫ్యాన్స్ కాస్త కంగారు పడిపోయారు. ఇంతకీ ఏం జరిగిందా? అని తెలుసుకునేందుకు తెగ తాపత్రయపడుతున్నారు.
‘సీతారామం’.. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. హీరో దుల్కర్ సల్మాన్ క్రేజ్ మరింతగా పెంచేసింది. అదే టైంలో హీరోయిన్ మృణాల్ ఠాకుర్ కు స్టార్ హీరోయిన్ హోదా తీసుకొచ్చింది. ఈ మూవీతో మృణాల్ తెలుగువాళ్లకు బాగా దగ్గరైపోయింది. ఆమె ఇప్పటివరకు ఏం సినిమాలు చేసింది. ఇప్పుడు ఏం చేస్తోంది అంటూ అన్ని ఫాలో అయిపోతున్నారు. అలాంటిది సడన్ గా ఆమె కన్నీళ్లు పెట్టుకున్న ఫొటోని ఇన్ స్టా స్టోరీలో చూసి అభిమానులు కాస్త కంగారు పడ్డారు. అరే.. అసలేమైంది? ఈ బ్యూటీ ఏడవడానికి కారణమేంటా అని తెగ డిస్కషన్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది?
ఇక వివరాల్లోకి వెళ్తే.. సినిమా యాక్టర్స్ అనగానే అందరికీ వాళ్ల లగ్జరీ లైఫ్ గుర్తొస్తుంది. కార్లు, బంగ్లాలు, కాస్ట్ లీ డ్రస్సులు.. బయటకు ఇవే కనిపిస్తాయి. అయితే వాళ్లు జీవితంలోనూ మనకున్నట్లే కష్టాలు ఉండనే ఉంటాయి. వాటిని అప్పుడప్పుడు బయటపెడుతూ ఉంటారు. తాజాగా అలాంటి పరిస్థితి తన లైఫ్ లో ఎదురైందని హీరోయిన్ మృణాల్ చెప్పుకొచ్చింది. అప్పుడు తీసుకున్న ఫొటోనే ఇది అంటూ క్యాప్షన్ పెట్టి మరీ పోస్ట్ చేసింది. చాలా లోగా అంటే బాగా డిప్రెషన్ లో ఉన్న టైంలో తీసుకున్న పిక్ ఇది అని, ఇప్పుడైతే బాగానే ఉన్నానంటూ సీతారామం బ్యూటీ చెప్పుకొచ్చింది.
‘నిన్న కష్టంగా గడిచింది. ఈ రోజు మాత్రం నేను స్ట్రాంగ్ గా, హ్యాపీగా ఉన్నాను. ప్రతి ఒక్కరి జీవితంలోనూ కొన్ని పేజీలు ఉంటాయి. వాటిని పెద్దగా చెప్పుకోరు. కానీ నేను మాత్రం వాటిని బయటకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే వీటిని చూసి వేరే ఎవరైనా నేర్చుకోవచ్చు కదా. అమాయకంగా ఉండటం తప్పేం కాదు’ అని హీరోయిన్ మృణాల్ తన స్టోరీకి క్యాప్షన్ పెట్టింది. ఇదిలా ఉండగా ఈమె హీరోయిన్ గా నటించిన హిందీ సినిమా ‘గుమ్రా’ ఏప్రిల్ 7న థియేటర్లలోకి రానుంది. తెలుగులో నాని హీరోగా చేస్తున్న ఓ మూవీలోనూ మృణాల్ హీరోయిన్ గా చేస్తోంది. సరే ఇదంతా పక్కనబెడితే.. మృణాల్ కన్నీళ్లకు కారణం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.