తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య పలువురు సినీ ప్రముఖులు అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ప్రముఖ నటులు కైకాల సత్యనారాయణ ఇటీవల తీవ్ర అస్వస్థతో ఆసుపత్రిలో చికిత్స తీసుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనా తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇండస్ట్రీలో ఈ బాధ మరువక ముందే ప్రముఖ తెలుగు సినీ గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తీవ్ర అస్వస్థతతో.. హైదరాబాద్‌లోని కిమ్స్ హస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
కిమ్స్‌కు చెందిన ప్రముఖ డాక్టర్లు వైద్యం అందిస్తున్నట్లుగా సమాచారం. సిరివెన్నల చిత్రంతో ఆయన ప్రస్థానం మొదలైంది.. ఆ సినిమా పేరునే తన పేరు ముందు పెట్టుకొని సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా పాపులర్ అయ్యారు. విధాత తలపున ప్రభవించినది… అంటూ ఆయన రాసిన మొదటి పాటే తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ఆయనకు స్థానం సంపాదించి పెట్టంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.