Siri Hanmanth And Srihan: బిగ్‌బాస్ తెలుగు షోతో పాజిటివ్‌గా పేరు తెచ్చుకున్న వారు కొందరైతే.. కాంట్రవర్సీలతో నెగిటివ్ పబ్లిసిటీ తెచ్చుకున్నవారు మరికొందరు. అలాంటి వారిలో బుల్లితెర నటి సిరి హన్మంతు ఒకరు. సిరి బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్‌గా ఉన్నపుడు షన్ముఖ్ జశ్వంత్‌తో హద్దులు మీరి ప్రవర్తించారు. దీంతో షన్ను, దీప్తి సునయల ప్రేమ బంధం తెగిపోయింది. ఈ ప్రభావం అంతటితో ఆగలేదు. సిరి, ఆమె ప్రియుడు శ్రీహాన్‌ల మధ్య కూడా పొరపచ్చాలు వచ్చాయి. చాలా కాలం వీరు ఒకరికొకరు దూరంగా ఉన్నారు. ఇద్దరూ విడిపోయారంటూ ప్రచారం కూడా జరిగింది. అలాంటి సమయంలో ఓ పార్టీలో ఇద్దరూ కనిపించారు. అనంతరం సిరి, శ్రీహాన్‌తో కలిసి దిగిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ..
‘తనే నా ఏకైక ప్రేమ.. నా పక్కనే ఉంటూ నా మంచి, చెడు అన్ని సందర్భాల్లో నా పక్కన నిలబడ్డాడు. నా బలం, నా మార్గదర్శి, నా గార్డియన్, నా సర్వస్వం’ అని పేర్కొంది. దీంతో ఆ పుకార్లకు కాస్తా బ్రేక్ పడింది. ఆ తర్వాత ఇద్దరూ మళ్లీ కలిసి కనిపించలేదు. ఇలాంటి సమయంలో మళ్లీ పుకార్లు రావటం మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో సిరి, శ్రీహాన్ ఓ టీవీ ప్రోగ్రామ్‌లో కనిపించి మరోసారి పుకార్లకు చెక్ పెట్టారు.
ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించిన మొగుడ్స్-పెళ్లామ్స్ షోలో పాల్గొన్నారు. ‘ నీ లిప్పులోంచి దూసుకొచ్చే ఫ్లైయింగ్ కిస్సు’’ అనే పాటకు డ్యాన్స్ వేశారు. ఈ ప్రోగ్రామ్ ఆదివారం 12 గంటలకు ప్రసారం కానుంది. ఇక, సిరి, శ్రీహాన్‌లు డ్యాన్స్ మాత్రమే చేశారా?లేక ఫుల్ ఎపిసోడ్‌లో భాగం అయ్యారా? అన్నది తెలుసుకోవాలంటే పూర్తి ప్రొగ్రామ్ చూడాల్సిందే. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Priyanka Jawalkar: బాయ్‌ఫ్రెండ్‌తో డేట్‌కి వెళ్లిన ప్రియాంక జవాల్కర్.. ఆ క్రికెటరే అంటున్న నెటిజనులు!