'సార్' చెప్పిన పాఠాలు ప్రేక్షకులకు తెగ నచ్చేసినట్లు కనిపిస్తున్నాయి. అందుకే కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. మరి తొలి వీకెండ్ అయ్యేసరికి ఎన్నో కోట్లు వచ్చాయో తెలుసా?
తెలుగు ప్రేక్షకులకు ఏ సినిమా ఎప్పుడు ఎందుకు నచ్చుతుందో అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేం. అలా తాజాగా బాగా నచ్చేసిన మూవీ ‘సార్’. ధనుష్ హీరోగా చేసిన ఈ చిత్రం.. తెలుగు, తమిళంలో రిలీజైంది. ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచే హిట్ టాక్ అందుకుంది. స్టోరీతో పాటు ధనుష్ యాక్టింగ్, వెంకీ అట్లూరి డైరెక్షన్, సంయుక్త అందం.. ఇలా ‘సార్’కు అన్నీ కలిసొచ్చాయి. దీంతో థియేటర్లలో విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. లాభాల్లోకి కూడా వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ విషయం సినీ వర్గాల్లో ఆసక్తిగా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పాన్ ఇండియా కల్చర్ పెరిగిపోయిన తర్వాత తెలుగు హీరోలు వరల్డ్ వైడ్ పాపులర్ అయిపోతున్నారు. మిగతా భాషల హీరోలు, టాలీవుడ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అలా విజయ్, శివకార్తికేయన్ లాంటి వాళ్లు.. తెలుగు డైరెక్టర్స్ తో మూవీస్ చేశారు. ఇప్పుడు ధనుష్ కూడా యువ దర్శకుడు వెంకీ అట్లూరి తీసిన ‘సార్’లో హీరోగా చేశాడు. క్లీన్ హిట్ కొట్టేశాడు. 1990ల్లో విద్యావ్యవస్థ, ప్రైవేట్ కాలేజీల మోసాలు లాంటి స్టోరీని చాలా మంచిగా తీశారు. దీంతో సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తోంది.
మరి ‘సార్’ మూవీ బాగుంది అని టాక్ వచ్చింది కాబట్టి కలెక్షన్స్ కూడా అలానే వస్తున్నాయి. తెలుగులో ధనుష్ సినిమాలంటే అందరికీ తెలిసింది ‘రఘువరన్ బీటెక్’ మాత్రమే. అది లాంగ్ రన్ రూ 4.5 కోట్లు వసూలు చేస్తే.. ఇప్పుడు ‘సార్’ మాత్రం అంతకు మించిన అనేలా బాక్సాఫీస్ దగ్గర పరుగెడుతోంది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ 16.54 కోట్ల గ్రాస్ సాధించి బ్రేక్ ఈవెన్ సాధించిందట. సినిమా కొన్న ప్రతి బయ్యర్ కూడా లాభాలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ‘సార్’ సినిమాతో తెలుగులో ధనుష్ కు మంచి ఎంట్రీ దక్కిందని.. ఇక్కడి ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి ‘సార్’ మూడు రోజుల వసూళ్లు, లాభాల్లోకి వెళ్లడంపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.
#SIRmovie collected 16.54 cr gross in 3 days. It’s a clean BLOCKBUSTER. Each & Every Buyer crossed the BREAKEVEN mark & entered into the Profit Zone. @dhanushkraja #VenkyAtluri @vamsi84 @SitharaEnts @gvprakash @iamsamyuktha_ @NavinNooli pic.twitter.com/MK0NZkZZ7L
— Shreyas Media (@shreyasgroup) February 20, 2023