తెలుగులో ఇప్పటివరకు మూడు సినిమాలు చేసింది. కానీ క్రేజ్ మాత్రం యమగా తెచ్చుకుంది. స్టార్ గా మారే ఛాన్సులు గట్టిగానే ఉన్నాయి. మరి ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
ఆ హీరోయిన్ ని చూడగానే అరే అమ్మాయి ఎవరో గానీ అదిరిపోయింది అని మీకు తెలియకుండానే అనేస్తారు. ఎందుకంటే ఆమె అంత బాగుంటుంది కాబట్టి. స్వతహాగా మలయాళీ అయినప్పటికీ తెలుగువాళ్లకు ఇప్పుడిప్పుడే బాగా దగ్గరవుతుంది. అటు స్టార్ హీరోలతో పాటు మిడ్ రేంజ్ హీరోలకు జోడీగా భలే సెట్ అయిపోతోంది. తాజాగా ఆమె చిన్నప్పటికీ ఫొటో ఒకటి వైరల్ గా మారింది. ఈ ఫొటోని బట్టి చూస్తుంటే ఆమె చదువుల్లో టాపర్ అనిపిస్తుంది. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా? లేదా చెప్పేయమంటారా?
పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ‘భీమ్లా నాయక్’తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి, ‘సార్’తో తాజాగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న సంయుక్త మేనన్. కేరళలోని పాలక్కాడ్ లో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ.. ఎకనామిక్స్ లో గ్యాడ్యుయేషన్ పూర్తి చేసింది. చిన్నప్పుడే స్కూల్లో డ్యాన్స్, నాటకాల్లో ఫెర్ఫార్మెన్స్ ఇస్తుండేది. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా కొన్ని వైరల్ అయ్యాయి. ఇక సంయుక్త కెరీర్ విషయానికొస్తే.. 2016లో రిలీజైన మలయాళ మూవీ ‘పాప్ కార్న్’తో నటిగా మారింది. తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత దాదాపు ఐదేళ్ల పాటు మలయాళంలో మూవీస్ చేస్తూ వచ్చింది. మధ్యలో తమిళ చిత్రాలు రెండు చేసింది.
అలా హీరోయిన్ గా బాగా క్రేజ్ తెచ్చుకుని సంయుక్తని తెలుగు నిర్మాతలు గుర్తించారు. ‘భీమ్లా నాయక్’లో రానా భార్యగా నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత కల్యాణ్ రామ్ ‘బింబిసార’లోనూ వన్ ఆఫ్ ది హీరోయిన్ గా చేసింది. ఇక తాజాగా ధనుష్ యాక్ట్ చేసిన ద్విభాషా చిత్రం ‘సార్’లో బ్యూటీఫుల్ బయాలజీ టీచర్ గా ఫుల్ మార్క్స్ కొట్టేసింది. ఇక సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘విరూపాక్ష’లోనూ సంయుక్తనే హీరోయిన్ గా చేస్తున్నట్లు అనిపిస్తుంది. దీని తర్వాత కూడా పలు ప్రాజెక్టుల్లో ఈమెని హీరోయిన్ గా తీసుకోవాలని దర్శకనిర్మాతలు అనుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే మరో రెండు మూడేళ్లలో టాలీవుడ్ లో సంయుక్త స్టార్ హీరోయిన్ అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మరి సంయుక్త చిన్నప్పటి పిక్ చూసి మీలో ఎంతమంది గుర్తుపట్టారు. కింద కామెంట్ చేయండి.