తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది సింగర్స్ ఉన్నారు. కానీ.., అందరికన్నా ముందు గ్లామరస్ సింగర్ గా పేరు తెచ్చుకుంది మాత్రం సునీత మాత్రమే. ఈ వేళ లో నీవు ఏం చేస్తూ ఉంటావో అంటూ ఆమె పాడే గాత్రమే కాదు.., రూపం కాదు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చింది. అందంలో విషయంలో సునీత ఇప్పటికే తగ్గేదే లే అన్నట్టు ఉంది. కానీ.., ఇప్పుడు సునీత కూతురు అందం విషయంలో అమ్మకి పోటీగా వచ్చేసింది. సింగర్ సునీతకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిలో అమ్మాయి పేరు శ్రేయా గోపరాజు. కొడుకు పేరు ఆకాష్. తాజాగా శ్రేయా 19వ పుట్టినరోజు సందర్భంగా సునీత తన కూతురు ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ పోస్ట్ లో సునీత మై ప్రిన్సెస్ అనే ట్యాగ్ లైన్ కి.., తన కూతురు ఫోటోని జత చేసింది.
ఈ పిక్ లో శ్రేయా గోపరాజు క్యూట్ నెస్ తో అదరకొట్టింది. దీంతో.., శ్రేయా గోపరాజు అందానికి ముగ్ధులు అయిన నెటిజన్స్ కామెంట్స్ వర్షం కురిపించారు. “అందం విషయంలో అమ్మనే దాటిపోయావు శ్రేయా.. ఆల్ దా బెస్ట్ అంటూ ఎక్కువ మంది కామెంట్స్ చేయడం విశేషం”. దీంతో.., సునీత షేర్ చేసిన ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగు చలనచిత్ర రంగంలో గత 20 ఏళ్లలో నేపధ్య గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సునీత తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది. ప్రస్తుతం ఆమె కూతురు శ్రేయా గోపరాజు కూడా సింగర్ గా సక్సెస్ కావడానికి ప్రయత్నాలు చేస్తోంది. శ్రేయా ఇప్పటికే కొన్ని చిత్రాలలో పాటలని ఆలపించింది కూడా. కీరవాణి మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన సవ్యసాచి సినిమాలో మొదటి పాట పాడింది. అప్పటి నుంచి ఆమె కెరీర్ కొనసాగుతోంది. మరి.. అందం విషయంలో అమ్మకే పోటీ ఇస్తున్న శ్రేయా.., సింగర్ కూడా అమ్మ స్థాయిని అందుకుంటుందేమో చూడాలి.