సింగర్ సునీత.. ప్రేక్షకులు, సంగీత ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు. తన పాటలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఒక హీరో, హీరోయిన్ కు ఎంత ఫాలోయింగ్ ఉంటుందో.. అంతటి ఫ్యాన్ బేస్ సునీత సొంతం. సోషల్ మీడియాలోనూ సునీత ఎంతో యాక్టివ్ గా ఉంటుంటారు. ఆమె తరచూ ఫొటోలు, వీడియోలు, ఫన్నీ మూమెంట్స్ ను తన అభిమానులతో షేర్ చేసుకుంటారు. అవి కాస్తా తరచూ వైరల్ అవుతూ ఉంటాయి.
ఇదీ చదవండి: నాపై అక్కడ చేయిపెట్టాడనే శ్రీకాంత్ రెడ్డిని కొట్టా: కరాటే కళ్యాణి
ప్రస్తుతం సింగర్ సునీత తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫొటోలు కొన్ని వైరల్ అవుతూ ఉన్నాయి. చిలుకలు, గోరింకల నడుమ సునీత సందడి చేశారు. వాటితో సంతోషంగా గడిపిన క్షణాలను అభిమానులతో పంచుకున్నారు. చిలుకలకు గింజలు పెడుతూ.. వాటిని తలపై పెట్టుకుని ఎంతో ఆనందంగా గడిపారు. సింగర్ సునీత పాటకే కాదు.. ఆమె వ్యక్తిత్వానికి, మంచితనానికి కూడా పెద్ద అభిమాన గణమే ఉంది. ప్రస్తుతం సునీత షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఆ వైరల్ ఫొటోలు మీరూ చూసేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.