సినీ ఇండస్ట్రీలో తన గాత్రంతో ఎంతో మంది ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది అందాల సింగర్ సునీత. నిత్యం సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు. సింగర్ ఎంతో మంచి పేరు తెచ్చున్న సునిత ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నా అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చేసిన కొన్ని ఫోటోలు, వీడియో ఫ్యాన్స్ కి షేర్ చేసింది. ఆ వీడియో చూసిన ఫ్యాన్స్ లైక్స్, కామెంట్స్ తో అభిమానం చాటుకుంటున్నారు. సాధారణంగా సెలెబ్రెటీలకు వ్యవసాయం అంటే గొప్ప సరదా.
ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరికీ ఓ ఫార్మ్ ల్యాండ్ కలిగి ఉన్నవారే.. ఖాళీ సమయాల్లో సదరు ఫార్మ్ హౌస్ లో గడపడం వారికి ఆహ్లాదం పంచే విషయం. అలాగే అక్కడ ఆవులు, గేదెల పెంపకం, పళ్ళు, కూరగాయలు పండించడం చేస్తుంటారు. దానికి సంబంధించిన ఫోటోలో సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో సింగర్ సునీత కూడా తమ ఫార్మ్ హౌస్ లో వ్యవసాయం చేస్తున్నారు. ఆమె తమ పొలంలో పండిన అరటి పండ్లను స్వయంగా చెట్టునుండి కోశారు. సదరు వీడియో ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా.. లక్షల్లో వీక్షించారు. ఇక 23 వేలకు పైగా నెటిజెన్స్ ఆ వీడియోను లైక్ చేశారు.
ఇది కూడా చదవండి : దీప్తి – షణ్ముఖ్ బ్రేకప్ పై మానస్ ఓపెన్ కామెంట్స్
గతంలో కూడా తమ ఫార్మ హౌజ్ లో కూరగాయలు, ఆకు కూరలు సేద్యం చేసినట్లు తెలిపారు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా షేర్ చేశారు. ఇక 2021 జనవరి 9న సునీత మ్యాంగో మీడియా అధినేత రామ్ ని వివాహం చేసుకున్నారు. సునీత రెండవ వివాహం తర్వాత మరింత హ్యాపీ లైఫ్ అనుభవిస్తున్నారు. ప్రస్తుతం టెలివిజన్ షోలకు జడ్జిగా, సింగర్ గా కొనసాగుతున్నారు.