ప్రముఖ గాయని ఎస్పీ శైలజ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో మధురమైన పాటలతో అందరి మదిలో ప్రత్యేక స్థానం సంపాదించారు. అయితే తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. పలు ఆసక్తికరమై విషయాలు తెలిపారు.
ఎస్పీ శైలజ.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. నాలుగున్నర దశాబ్దాలకు పైగా ఆమె స్వరం ఆపాత మధురమై.. ప్రతి మనస్సులో మంత్రమై.. బంధమై అల్లుకుంటోంది. ఆమె గళంలో ఎలాంటి పాటలైనా ఒదిగిపోతాయి. ఆమె గానంలో ఎంత మాధ్యుర్యం ఉంటుందో.. ఆమె పిలుపులో అంతే ఆప్యాయత ఉంటుంది. ఆమె కేవలం పాటల్లోనే కాకుండా డబ్బింగ్ లోనూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు. తాజాగా “చెప్పాలని ఉంది” అనే ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తన సినీ కెరీర్ కు సంబంధించిన అనే విషయాలను షేర్ చేసుకున్నారు. అలానే ఓ హీరోని కాలుతో తన్నాల్సి వచ్చిందని ఎస్పీ శైలజ తెలిపారు. మరి.. ఆ సంగతులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ గాయకుల్లో ఎస్పీ శైలజ ఒకరు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెల్లిగా, ఎంతో మంచి గాయనిగా పేరు తెచ్చుకున్న ఎస్పీ శైలజ తన మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చిందనే విషయాన్ని వివరించారు. “చెప్పాలని ఉంది” కార్యక్రమంలో పాల్గొన్ని అలనాటి విసేషాలను ఎస్పీ శైలజ వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ..” నేను అసలు ఇంత పెద్ద సింగర్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. బహుశా ఒక్క పాట పాడతానేమో మూవీలో అనుకున్నాను. నేను, మా అన్నయ్య ఎస్పీ బాలు మాత్రమే శాస్త్రీయ సంగీతం నేర్చుకోలేదని, ఇంట్లో వాళ్లంతా నేర్చుకున్నారు. కానీ నన్ను పాడాలని మా అమ్మ బాగా ప్రోత్సహించేది.
అలా మొదటి సారి ‘మార్పు’ సినిమాలో పాడే అవకాశం వచ్చింది. చక్రవర్తిగారు ఆ సినిమాలో ఓ పాట పాడించారు. నేను 8 ఏళ్ల వయసులో ఏదో పాటపాడితే కావలిలో ఘంటసాల చేతుల మీదుగా ప్రైజ్ అందుకున్నాను. ఇక నా జీవితంలో ఓ మరచిపోలేని సన్నివేశాల్లో ‘సాగరసంగమం’ సినిమాకు సంబంధించి ఒకటి ఉంది. ఆ సినిమాలో కమల్ హాసన్ గారిని కాలుతో తన్నే సన్నివేశం ఉంది. ఆ సినీ చేసేందుకు నేను ఎంతో ప్రయత్నించాను. అలా నేను ఎంత ట్రై చేసిన కాలు వెనక్కి వచ్చేసేది. అప్పుడు విశ్వానాథంగా నాకు ధైర్యం చెప్పారు. ఇది కేవల పాత్రలు మాత్రమేనని వివరంగా చెప్పారు. అలా విశ్వానాథ్ గారి నుంచి చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను” అని శైలజ తెలిపారు. మరి.. ఎస్పీ శైలజ గారు తెలిపిన తన జీవిత విశేషాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.