తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 విజయవంతంగా దూసుకుపోతోంది. దేశ నలుమూలల్లో ఎక్కడెక్కడో దాగి ఉన్న ప్రతిభావంతులను ఈ ప్రోగ్రామ్ ప్రపంచానికి పరిచయం చేస్తోంది. తెలుగు ఓటిటి ఆహాలో ప్రసారమవుతున్న ఈ తెలుగు ఇండియన్ ఐడల్ లో.. రోజురోజుకూ కొత్త కొత్త పెర్ఫార్మన్స్ లతో పాటు ఎమోషనల్ మూమెంట్స్, ఇన్స్పైరింగ్ మూమెంట్స్ కూడా చోటు చేసుకుంటున్నాయి.
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 విజయవంతంగా దూసుకుపోతోంది. దేశ నలుమూలల్లో ఎక్కడెక్కడో దాగి ఉన్న ప్రతిభావంతులను ఈ ప్రోగ్రామ్ ప్రపంచానికి పరిచయం చేస్తోంది. తెలుగు ఓటిటి ఆహాలో ప్రసారమవుతున్న ఈ తెలుగు ఇండియన్ ఐడల్ లో.. రోజురోజుకూ కొత్త కొత్త పెర్ఫార్మన్స్ లతో పాటు ఎమోషనల్ మూమెంట్స్, ఇన్స్పైరింగ్ మూమెంట్స్ కూడా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇండియన్ ఐడల్ కంటెస్టెంట్.. తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో మ్యూజిక్ డైరెక్టర్ కోటి.. కంపోజిషన్ లో సాంగ్ పాడే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సింగర్స్ గీతా మాధురి, కార్తీక్ జడ్జిలుగా వ్యవహరిస్తున్న ఈ ప్రోగ్రాంకి కోటి స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు.
ఈ క్రమంలో.. వైజాగ్ కి చెందిన కంటెస్టెంట్ సౌజన్య.. ‘అంజనీ పుత్రుడా.. వీరాధి వీరుడా!’ అనే సాంగ్ తో పెర్ఫార్మన్స్ అదరగొట్టేసింది. దీంతో ఆడియెన్స్, జడ్జిలతో పాటు కోటి కూడా మెస్మరైజ్ అయిపోయారు. దీంతో వెంటనే.. సౌజన్యని అభినందించి.. తాను ఇప్పటిదాకా రిలీజ్ చేయకుండా కంపోజ్ చేసి పెట్టిన సాంగ్ పాడేందుకు ఆమెకు ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత సౌజన్యతో కలిసి కోటి స్టేజ్ పై ఎంతో ఆనందంగా తన సాంగ్ పాడి అలరించారు. ప్రస్తుతం ఈ హ్యాపీ మూమెంట్ సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. మరి సింగర్ సౌజన్యకి కోటి గోల్డెన్ ఛాన్స్ ఇవ్వడంపై.. ఆమె పాడిన అంజనీ పుత్రుడా సాంగ్ పెర్ఫార్మన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.