సింగర్ స్మిత.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న పేరు. నిజం విత్ స్మిత అనే టాక్ షో ద్వారా ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. తాజాగా స్మితకు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితె..
ప్రస్తుతం ఇటు బుల్లితెరలోనూ, అటు రాజకీయ రంగంలోనూ హాట్ టాపిక్ గా మారారు సింగర్ స్మిత. ‘నిజం విత్ స్మిత’ టాక్ షోతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు ఆమె. ఇక టాలీవుడ్ లో మెట్టమెుదటి పాప్ సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు స్మిత. సింగర్ గానే కాకుండా అటు వ్యాపారవేత్తగా కూడా మంచి సక్సెస్ ను అందుకున్నారు ఆమె. తాజాగా సోనిలీవ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న నిజం విత్ స్మిత టాక్ షో అద్భుతంగా ప్రేక్షకుల ఆదరణ చురగొంటోంది. ఇక ఈ షోకు సంబంధించిన ప్రోమో, ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ షోకు చిరంజీవి, చంద్రబాబు నాయుడు లతో పాటుగా మరికొంత మంది సెలబ్రిటీలు వచ్చారు.
ఈ క్రమంలోనే చిరంజీవి ఎపిసోడ్ తో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచారు స్మిత. అయితే ఇప్పుడు స్మితకు సంబంధించిన పాత ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఆ ఫోటో లో తెలుగుదేశం పార్టీ తరపున అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. కార్యకర్తలతో దిగిన ఫోటోలు వైరల్ గా మారడంతో.. సింగర్ స్మిత టాక్ షోకు రాజకీయ రంగు పులుముతున్నారు. ఇక నిజం విత్ స్మిత టాక్ షో ప్రారంభం తర్వాత ఆమె పలు ఛానల్స్ కు ఇంటర్య్వూలు ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూల్లో చంద్రబాబు ఆలోచనల గురించి ఆమె చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ఫ్యూచర్ విజనరీని పలు సందర్భాల్లో ప్రశంసించారు స్మిత. ఇక ప్రస్తుతం ఆమె గతంలో టీడీపీ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న పిక్స్ వైరల్ కావడంతో.. ప్రస్తుతం ఆమె హోస్ట్ గా వ్యవహరిస్తున్న షోకు కూడా ఆ రాజకీయ రంగును ఆపాదిస్తున్నారు కొందరు. అదీకాక స్మిత టాక్ షోకు చంద్రబాబు నాయుడు కూడా రావడంతో టాక్ షోకు మరింతగా రాజకీయ రంగు పులమడానికి అవకాశం లభించింది. మరి తాజాగా వైరల్ అవుతున్న స్మిత పాత ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.