ఓ స్టార్ సింగర్ కొన్ని రోజుల క్రితం తన జీవితంలో జరిగిన భయంకరమైన సంఘటనను తాజా ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నాడు. తన నాన్నకు తగిలిన గాయం కావడంతో.. వారం రోజులు కోమాలో ఉన్నాడని, 16 కుట్లు సైతం పడ్డాయని ఎమోషనల్ అయ్యాడు.
సెలబ్రిటీల జీవితాలు పైకి ఎంతో కలర్ ఫుల్ గా కనిపిస్తున్నా.. కొందరి జీవితాల్లో మాత్రం విషాదాలు నిండి ఉంటాయి. ఇక వారి విషాదాలను సమయం వచ్చినప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఓ స్టార్ సింగర్ కొన్ని రోజుల క్రితం తన జీవితంలో జరిగిన భయంకరమైన సంఘటనను తాజా ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నాడు. తన నాన్నకు తగిలిన గాయం కావడంతో.. వారం రోజులు కోమాలో ఉన్నాడని, 16 కుట్లు సైతం పడ్డాయని ఎమోషనల్ అయ్యాడు. ఇక అప్పడు నాన్న రక్తంతో నా బట్టలు మెుత్తం తడిసిపోయాయని కన్నీరు నింపుకున్నాడు. మరి ఆ తండ్రికి గాయం ఎలా అయ్యింది? ఆ స్టార్ సింగర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
అతడో స్టార్ సింగర్.. మెుదట్లో టీవీ సీరియల్స్ కు ప్లే బ్యాక్ సింగర్ గా పని చేసి.. ఆ తర్వాత సినిమాలకు పాడటం స్టార్ట్ చేశాడు. అతడి పేరు షాహిద్ మాల్యా. ‘యమ్లా పాగ్లా దీవానా’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు షాహిద్. ఆ తర్వాత మౌసమ్ సినిమాలో పాటలు సూపర్ హిట్ కావడంతో.. ఒక్కసారిగా అతడి పేరు బాలీవుడ్ లో మారుమ్రోగింది. తెలుగులో సైతం కొన్ని పాటలు పాడాడు షాహిద్. ఇక తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో తన తండ్రి గురించి షాకింగ్ విషయాలను వెల్లడించాడు. తన తండ్రికి జరిగిన సంఘటనను తలచుకుని ఎమోషనల్ అయ్యాడు. ఈ సందర్భంగా షాహిద్ మాల్యా మాట్లాడుతూ..
“మా నాన్న కృష్ణ కుమార్ మాల్యా మార్చి 14న రాత్రి ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. దాంతో తలకు తీవ్రమైన గాయం అయ్యింది. ఆ గాయం కారణంగా కారిన రక్తానికి నా బట్టలు తడిసిపోయాయి. వెంటనే నాన్నని ఆస్పత్రికి తరలించాం. తలకు తీవ్ర గాయం కావడంతో.. 16 కుట్లు పడ్డాయి. దాంతో వారం రోజులు కోమాలోకి వెళ్లారు. అప్పటి దాక ఆయన్ని ఐసీయూలోనే ఉంచారు” అంటూ తన జీవితంలో జరిగిన హృదయవిదారక సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఇక తన తండ్రి కూడా మంచి గాయకుడు అంటూ చెప్పుకొచ్చాడు షాహిద్. దిగ్గజ సంగీత దర్శకులు మహ్మద్ రఫీ వంటి గాయకులతో పని చేశారు అని తెలిపాడు. అయితే తనకు యాక్సిడెంట్ కావడంతో.. గాయకుడిగా కెరీర్ కొనసాగించలేకపోయాడు అంటూ చెప్పుకొచ్చాడు స్టార్ సింగర్ షాహిద్ మాల్యా.