పాటల ప్రేమికులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ‘‘రేవంత్’’. సింగర్‌గా రేవంత్ సాధించిన విజయాలు అన్నీ ఇన్నీ కాదు. టాలీవుడ్‌లో టాప్ సింగర్‌గా వెలుగొందుతున్న సమయంలోనే ఇండియన్ ఐడల్‌కు వెళ్లాడు. అక్కడా తన సత్తా చాటాడు. టైటిల్ విన్నర్‌గా నిలిచాడు. ప్రస్తుతం బిగ్‌బాస్‌లోనూ తన సత్తా చాటుతున్నాడు. విజయానికి కొన్ని అడుగుల దూరంలో ఉన్నాడు. మరికొన్ని గంటల్లో బిగ్‌బాస్ టైటిల్ విన్నర్ ఎవరో తెలిపోతుంది. రేవంత్‌కే టైటిల్ వచ్చే అవకాశం ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు.
ముఖ్యంగా రేవంత్ కుటుంబ సభ్యులు ఎక్కువ నమ్మకంతో ఉన్నారు. తమ కుమారుడు రేవంత్ తప్పక విజయం సాధిస్తాడని, టైటిల్‌తో ఇంటికి వస్తాడని రేవంత్ తల్లి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను చెప్పారు. రేవంత్ చిన్ననాటి సంగతులను చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘ మా ఆయన పేరు శంకర. రేవంత్ కడుపులో ఉన్నప్పుడే వాళ్ల నాన్న చనిపోయాడు. మా పుట్టింటివాళ్లే అన్నీ అయి చూసుకున్నారు. మా అమ్మా,నాన్న, వదినలు, అన్నలు అందరూ బాగా చూసుకున్నారు. వారి వల్లే నేను ఇలా ఉన్నాను.
లేకపోతే రోడ్డు మీద ఉండేదాన్ని. నా ఇద్దరు పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. నాన్న లేడని వాడికి చెబితే మనసులో పెట్టుకుంటాడని అబద్ధం చెప్పాం. మీ నాన్న దుబాయ్‌లో ఉంటున్నాడు. అస్తమానం రావటానికి వీలవ్వదూ. ఫోన్‌లు చేస్తారులే అని మా చిన్న అన్నయ్య నేను చెప్పేవాళ్లం. పిల్లలకు మైండ్‌లో పడకుండా ఉండటానికి అలా చెప్పేదాన్ని. రేవంత్ ఇప్పటికీ వాళ్ల నాన్నను తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. అందుకే వాడంటే నాకు కొంచెం ఇది. వాడు వాళ్ల నాన్నని చూడలేదు. అన్నీ ఇచ్చిన దేవుడు ఆ ఒక్క లోటు పెట్టాడు అని ఏడుస్తూ ఉంటాను’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.