ప్రముఖ సింగర్ రక్షిత సురేష్ మలేషియాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆమె ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టి పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు బాగా దెబ్బతింది.. అందులోని..
ప్రముఖ సింగర్ రక్షిత సురేష్ ప్రమాదానికి గురయ్యారు. ఆమె ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టి.. రోడ్డు పక్కకు దూసుకెళ్లటంతో పెను ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. అదృష్టవశాత్తు కారులో ఉన్న రక్షితతో పాటు మిగిలిన వారికి కూడా ఏమీ కాలేదు. మలేషియాలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం గురించి రక్షిత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆదివారం ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘‘ ఈ రోజు నేను ఓ పెద్ద ప్రమాదానికి గురయ్యాను.
నేను ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ఉదయం మలేషియాలోని ఎయిర్‌పోర్టుకు వెళుతుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన 10 సెకన్లు నా జీవితం మొత్తం నా కళ్ల ముందు కదిలింది. ఎయిర్ బాగ్స్ నా ప్రాణాలు కాపాడాయి. లేదంటే పరిస్థితి దారుణంగా ఉండేది. జరిగిన దాన్ని తల్చుకుంటే నా శరీరం ఇప్పటికీ వణుకుతోంది. నేను, డ్రైవర్, మిగిలిన వాళ్లు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. ప్రాణాలతో బతికి బయటపడ్డందుకు చాలా అదృష్టవంతులము’’ అంటూ తన అనుభవాన్ని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నెటిజన్లు ఆమె చిన్న చిన్న గాయాలనుంచి కూడా త్వరగా కోలు కోవాలని కోరుకుంటున్నారు. కాగా, రక్షిత సురేష్ 2015లో వచ్చిన ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాతో సింగర్‌గా మారారు. ఈ సినిమాలోని ‘చల్లగాలి తాకుతున్న మేఘమైనది’ అనే పాటను పాడారు. తర్వాత గాడ్‌ఫాదర్‌లోనూ ఓ పాటను పాడారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ భాషల్లో పలు పాటలు పాడారు. తమిళ టీవీ ఛానల్లో వచ్చిన విజయ్ టీవీ సూపర్ సింగర్‌తో తమిళ నాట మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరి, సింగర్ రక్షిత సురేష్ ప్రమాదానికి గురవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.