ఒక్క పాటతో పార్వతి అనే పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది. కర్నూలు జిల్లా మారుమూల లక్కసాగరం అనే ఊరు నుంచి ఓ పాటల కార్యక్రమంలో పాల్గొంది. తన మొదటి పాటతోనే తమ ఊరికి బస్సు తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఎవరూ ఈ పార్వతి అంటూ అందరూ ఆమె గురించే వెతుకులాట మొదలు పెట్టారు.
తాజాగా ఆమెకు మరో అవకాశం వచ్చింది. అతిథిగా వచ్చిన హీరో కార్తికేయ తన తర్వాతి సినిమాలో పాట పాడించేందుకు సంగీత దర్శకుడితో మాట్లాడతానని స్టేజ్ పై చెప్పాడు. అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. పార్వతితో కలిసి కార్తికేయ రెండు స్టెప్పులు కూడా వేశాడు. యువన్ శంకర్ రాజా కూడా పార్వతి కచ్చితంగా ఉన్నత శిఖరాలు అందుకుంటుందని ఆకాంక్షించారు. కార్తికేయ ఇచ్చిన క్రేజీ ఆఫర్ తో పార్వతి పేరు మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. టాలెంట్ ఉంటే అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయి అనే మాటకు నిలువెత్తు నిదర్శనం పార్వతి అంటూ నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మరి, పార్వతికి కామెంట్స్ లో మీరు కూడా శుభాకాంక్షలు చెప్పేయండి.