సింగర్ పార్వతి.. ఈమెకు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. తన పాటలతో ఎంతో మందిని అభిమానులను సొంతం చేసుకుంది. ఊరికి బస్సు తెప్పించి తన మంచి మనసును నిరూపించుకుంది. కానీ, సింగర్ పార్వతి ఫ్యాన్స్ కు పెద్ద షాక్ తగిలింది. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో సింగర్ పార్వతి ఎలిమినేట్ అయింది. అయితే టైటిల్ విన్నర్ అవుతుందని నమ్మిన పార్వతి ఎలిమినేట్ కావడంతో తెలుగు ప్రేక్షకులు ఎంతో నిరాశకు గురయ్యారు. కంటెస్టెంట్స్ ఛాయిస్ రౌండ్ పేరిట 3 వారాలుగా షో సాగింది.
ఇదీ చదవండి: ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. అక్కడ ఆచార్య ఎంట్రీ లేనట్టే..!
రౌండ్-1లో కీర్తన, ప్రణవ్ కౌశిక్, శృతిక, శివాని, అభినవ్ ఆకట్టుకున్నారు. వారిలో శివాని, అభినవ్ 90కి పైగా మార్కులు సాధించి సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారు. ఇక శృతిక 89 పాయింట్లతో సత్తా చాటింది. ప్రణవ్ 85, కీర్తన 75 మార్కులు పొందారు. రౌండ్ -2లో అఖిల్, వినూత్న, కళ్యాణి, చరణ్, పార్వతి పాడారు . వీరిలో అఖిల్, వినూత్న, చరణ్ మంచి స్కోర్ తెచ్చుకున్నారు. ఇక పార్వతి 74, కళ్యాణి 67 మార్కులతో సరిపెట్టుకున్నారు. ఇక కంటెస్టెంట్స్ ఛాయిస్ రౌండ్-3లో దీప్తీ భట్, ఆస్తా, వళ్లి గాయత్రి, డానియెల్, వెంకట్ సుధాన్స్ తమ గాత్రంతో అలరించారు. ఆస్తాకి 98, డానియెల్ 92 స్కోర్ సాధించారు. గాయత్రి, దీప్తీ కూడా బాగానే పాడారు. కీర్తన, పార్వతి, కళ్యాణిలకు 80 కన్నా తక్కువ మార్కులే వచ్చాయి. ముఖ్యంగా కళ్యాణి అయితే కనీసం 70 మార్కులు కూడా తెచ్చుకోలేదు. ఇంక కీర్తన, పార్వతి, కళ్యాణీలు షో నుంచి ఎలిమినేట్ అయినట్లు ఎస్పీ శైలజ వెల్లడించారు.
సింగర్ పార్వతి ఎలిమినేట్ కావడం పట్ల సీనియర్ సింగర్స్ కూడా ఎంతో బాధపడ్డారు. సింగర్ పార్వతి ఎలిమినేట్ కావడం చూసి శ్రీముఖి ఎంతో బాధ పడింది. అయితే పార్వతి మాత్రం నవ్వుతూ ఎలా అయితే షోలో అడుగుపెట్టిందో అంతే నవ్వుతూ షో నుంచి నిష్క్రమించింది. ‘ఎస్పీ బాలు గారి ముందు పాడే అవకాశం దక్కలేదు గానీ, శైలజ గారి ముందు పాడటం ఎంతో సంతోషంగా ఉంది’ అంటూ సింగర్ పార్వతి సరిగమప షో నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది. అయితే ఆమె వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తిరిగి షోలోకి అడుగుపెడుతుందని ఫ్యాన్స్, అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. సింగర్ పార్వతి ఎలిమినేట్ కావడం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.