ముంబైలోని కోకిలాబెన్ థీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలోని బెడ్‌పై ఉన్న ఫొటోను ఆయన షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫోటోపై నెటిజన్లు ఎమోషనల్‌గా స్పందిస్తున్నారు.
ప్రముఖ సింగర్ అనురాగ్ పపాన్ మహంత అనారోగ్యానికి గురయ్యారు. అనారోగ్యం కారణంగా ఆయన శుక్రవారం ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ థీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కుమారుడు దగ్గరుండి మరీ పపాన్‌కు సేవలు చేస్తున్నాడు. ఆసుపత్రి బెడ్‌పై కుమారుడితో ఉన్న ఫొటోను పపాన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘ మన మందరం ఇలాంటి చిన్న సమస్యలతో పోరాడాల్సి వస్తుంది. ఇలాంటి వాటి గురించి నా సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేయటం నాకు అస్సలు ఇష్టం ఉండదు.
కానీ, గత రాత్రి సంగతి వేరు. ఇది మొదటిసారి. నా 13 ఏళ్ల కుమారుడు నా కోసం ఆసుపత్రిలో సేవలు చేస్తూ ఉన్నాడు. రాత్రంతా అలానే ఉండిపోయాడు. ఇది చాలా ఎమోషనల్ మూమెంట్. నేను.. నా ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులతో పంచుకోవాలని అనుకున్నాను. నేను నా తల్లిదండ్రులకోసం శ్రమించిన రోజులు గుర్తుకు వస్తున్నాయి. వాళ్లు ఇక్కడే ఉండి వాళ్ల మనవడు నాకు చేస్తున్న సేవల్ని చూసి సంతోషిస్తారు. నాకోసం ప్రార్థిస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు.
ఇప్పుడు నా ఆరోగ్యం కొంత బాగుంది’’ అని పేర్కొన్నారు. కాగా, పపాన్ 1998లో తన మ్యూజిక్ కెరీర్‌ను మొదలుపెట్టారు. అస్సామీలో మంచి మంచి ఆల్బమ్స్ చేశారు. 2006లో స్ట్రింగ్స్ అనే సినిమాలో ‘‘ఓం మంత్ర’’ అనే పాట పాడి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అస్సామీతో పాటు హిందీ, తమిల్, మరాఠీ భాషల్లో పాటలు పాడారు. సినిమాలతో పాటు పలు టీవీ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. మరి, అనురాగ్ పపాన్ మహంత అనారోగ్యంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.